ధోని దరిదాపుల్లోకి కూడా రాలేరు.. మహీని పక్కనబెడతారా?: ఆశిష్ నెహ్రా
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని విండీస్‌తో జరగబోయే ట్వంటీ-20 సిరీస్‌కు ఎంపిక చేయకపోవడం వివాదంగా మారిన నేపథ్యంలో.. భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ధోనికి అండగా నిలిచారు. ధోని ఫామ్ గురించి క్రికెట్ అభిమానులు ఆందోళన చెందవద్దని... ఆస్ట్రేలియా పర్యటనలో మళ్లీ ఆయన పామ్ లోకి వస్తారని నెహ్రా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
అయితే ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సీరిస్‌కు ధోనికి ఎంపికచేయక పోవడాన్ని నెహ్రా తప్పుబట్టారు. యువ క్రికెటర్ రిషబ్ పంత్ కోసం అనుభవజ్ఞుడైన ధోనిని పక్కనబెట్టడం సరికాదని తెలిపారు. టీ20 జట్టులో రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్‌లు బాగానే ఆడుతున్నారు. కానీ వారెప్పుడూ ధోనీతో సమానం కాదని ఆశిష్ నెహ్రా వ్యాఖ్యానించాడు. వాళ్లిద్దరూ ధోనీకి దరిదాపుల్లోకి కూడా చేరుకోలేరని వ్యాఖ్యానించాడు.
యువ ఆటగాళ్లకు ధోనీ విలువైన సలహాలు, సూచనలు ఇస్తుంటారని తెలిపాడు. మరీ ముఖ్యంగా కెప్టెన్ కోహ్లికి జట్టు సారథ్య బాధ్యతలు నిర్వర్తించడంలో ధోని సాయపడుతున్నాడని ఆశిష్ నెహ్రా వివరించాడు.