సోమవారం, 6 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 24 నవంబరు 2018 (08:56 IST)

24-11-2018 శనివారం దినఫలాలు - పనులు ఏమంత చురుకుగా...

మేషం: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు, కక్షిదార్లకు ఇబ్బందులు తప్పవు. మీ వాహనం విలువైన వస్తువులు మరమ్మత్తులకు లోనయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి, తోటివారితో సమస్యలు తప్పవు. మెుహమ్మాటాలకు పోయి ధనం విపరీతంగా వ్యయం చేయవలసి వస్తుంది. 
 
వృషభం: కొన్ని రహస్యాలు దాచిపెట్టాలనుకున్నా సాధ్యం కాదు. విద్యార్థులు, అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. భాగస్వామిక సమావేశాల్లో ప్రముఖుల ప్రస్తావనచోటు చేసుకుంటుంది. కాంట్రాక్టర్లకు అధికారుల నుండి ఒత్తిడి అధిదకం. క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి.  
 
మిధునం: వ్యాపార వ్యవహారాల్లో ఏకాగ్రత ముఖ్యం. అయిన వారే మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు టి.వి. ఛానెళ్ళ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. విదేశాలు వెళ్ళటానికి చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీపై సెంటిమెంట్ల ప్రభావం అధికం.  
 
కర్కాటకం: మీ కార్యక్రమాలు చేపట్టిన పనులు ఏమంత చురుకుగా సాగవు. వృత్తిపరంగా ఎదురైన చికాకులు సమసిపోగలవు. పత్రికా, వార్తా సంస్థలలోని వారు పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్త వహించాలి. ఆకస్మికంగా ఆలయాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకు ప్రయత్నాపూర్వకంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి.   
 
సింహం: నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు అధికారుల నుండి వేధింపులు, పనివారలతో చికాకులు తప్పవు. స్త్రీలలో నూతనోత్సాహం, హడావుడి చోటుచేసుకుంటాయి. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. మీ దురదృష్టానికి మిమ్ములను మీరే నిందించుకుంటారు.  
 
కన్య: అరుదైనా శస్త్రచికిత్సలు విజయవంతం కావడంతో వైద్యుల పేరు ప్రఖ్యాతలు ఇనుమడిస్తాయి. ధనానికి ఇబ్బంది లేకున్నా ఆర్థికస్థతి ఏమంత సంతృప్తికరంగా ఉండదు. దంపతుల ఆలోచనలు పరస్పరం సానుకూలంగానే ఉంటాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది.   
 
తుల: స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. ఖర్చులు పెరిగినా మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటుకాగలదు. అందరితోను కలుపుగోలుగా వ్యవహరించి మీ పనులు సానుకూలం చేసుకుంటారు. ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే కోరిక ఫలిస్తుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు మీరు చూసుకోవడమే శ్రేయస్కరం.  
 
వృశ్చికం: ఉద్యోగస్తులకు అధికారులతో పర్యటనలు, నూతన బాధ్యతలు వంటి పరిణామాలున్నాయి. ఏ వ్యక్తినీ అతిగా విశ్వసించడం మంచిది కాదు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలున్నాయి. వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు అనుకూలం. కొత్త వ్యక్తులతో పరిచయాలేర్పడుతాయి.  
 
ధనస్సు: ప్రతి విషయాన్ని ఆప్తులు, కుటుంబీకులకు తెలియజేయడం మంచిది. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. ప్రయాణాలలో, బ్యాంకు వ్యవహారాల్లోను మెళకువ అవసరం. రావలసిన ధనంలో కొంత మెుత్తం చేతికందుతుంది. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులు త్వరలోనే అనుకూలిస్తాయి.  
 
మకరం: కళ, క్రీడా రంగాలవారికి ప్రోత్సాహం లభిస్తుంది. మీ తప్పులు సరిదిద్దుకునేందుకు శ్రమిస్తారు. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మునుముందు మంచి ఫలితాలనిస్తాయి. బంధువులను కలుసుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి సమర్థులైున పనివారు లేక కొన్ని అవకాశాలు వదులుకోవలసివస్తుంది.     
 
కుంభం: ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాలవారికి ఆశాజనకం. ప్రేమికుల మధ్య వేదాంత ధోరణి కానవస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు, విద్యాసంస్థల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం అందటంతో పనులు వేగవంతమవుతాయి.   
 
మీనం: ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదాపడుతాయి. ఇతరులకు సలహా ఇవ్వడం వలన మాటపడవలసి వస్తుంది. బ్యాంకింగ్ రంగాలు, ప్రయాణాల్లో మెళకువ వహించండి. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా సాగుతాయి. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి.