బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : బుధవారం, 21 నవంబరు 2018 (11:30 IST)

21-11-2018 బుధవారం దినఫలాలు - విశ్రాంతి లోపం వంటి చికాకులు...

మేషం: వ్యాపారాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. బ్యాంకు పనులు ఆలస్యం కావడంతో నిరుత్సాహం చెందుతారు. ఆలస్యం కావడంతో నిరుత్సాహం చెందుతారు. ఆలయ సందర్శనాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. క్యాటరింగ్ పనివారలకు, వృత్తుల వారికి కలిసివస్తుంది. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్పురిస్తుంది. 
 
వృషభం: రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్టు వస్తువులను విడిపించుకుంటారు. ఉపాధ్యాయులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు తెలుసుకుంటారు. నూతన పరిచయాలు మీ పురోభివృద్ధికి నాందీ పలుకుతాయి. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. 
 
మిధునం: ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు తప్పవు. ఆస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. తరచు బంధుమిత్రుల రాకపోకలుంటాయి. కుటుంబ, ఆర్థిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది.  
 
కర్కాటకం: ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులకు వివరణ ఇచ్చుకోవలసివస్తుంది. క్రయవిక్రయాలు లాభిస్తాయి. ఉపవాసాలు, శ్రమాధిక్యత వలన స్త్రీలు అస్వస్థతకు లోనవుతారు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్త సూచనులు గోచరిస్తున్నాయి.  
 
సింహం: ఆర్థిక సమస్యల నుండి బయటపడుతారు. స్త్రీలకు దైవ కార్యాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. పత్రిగా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. భాగస్వామిక సమావేశాలు అర్థాంతంగా ముగుస్తాయి. ఇచ్చిపుచ్చుకునే విషయాలు, పెట్టిపోతల్లో ఖచ్చితంగా వ్యవహరించండి.  
 
కన్య: కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా అధికారుల గుర్తింపు ఉండదు. నూతన పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. కొంతమంది మీ ఆలోచనలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు.  
 
తుల: భాగస్వామిక వ్యాపారాల నుండి విడిపోవాలనే ఆలోచన స్పురిస్తుంది. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. ప్రింటింగ్ రంగాల వారికి సమర్థులైన పనివారలు దొరకటం కష్టమవుతుంది. గృహ నిర్మాణాలకు కావలసిన ప్లానుకు ఆమోదం లభిస్తుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం.  
 
వృశ్చికం: వన సమారాధనలు, వేడుకలకు ప్రణాళికలు రూపొందిస్తారు. దంపతుల మధ్య సఖ్యత లోపం, చికాకులు తలెత్తుతాయి. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. వ్యాపారాల అభివృద్ధికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. 
 
ధనస్సు: దైవదీక్షల పట్ల ఆసక్తి నెలకొంటుంది. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం. వృత్తుల వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. హోటర్, క్యాటరింగ్ పనివారలకు కలిసివస్తుంది. కార్యసాధనకు ధనం బాగా వ్యయం చేయవలసివస్తుంది.  
 
మకరం: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు చికాకులు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఏకపక్ష నిర్ణయాలు మంచిది కాదని గమనించండి. వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. భాగస్వామ్యుల మధ్య అవగాహన కుదరదు. వివాహ యత్నాలు ముమ్మరంగా సాగిస్తారు. విద్యార్థులకు తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి.  
 
కుంభం: ఉపాధ్యాయులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. గృహంలో ఒక శుభకార్యం నిశ్చయం కాగలదు. సన్నిహితుల ప్రోత్సాహంతో దైవదీక్షలు స్వీకరిస్తారు. వాహనం విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్ల విషయంలో పునరాలోచన చాలా అవసరం.  
 
మీనం: స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. విద్యార్థులకు ప్రేమ విషయాల్లో భంగపాటు తప్పదు. సమయానికి సహకరించని మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతి దూరంచేస్తుంది. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.