మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 23 నవంబరు 2018 (12:59 IST)

23-11-2018 శుక్రవారం దినఫలాలు - లౌక్యంగా వ్యవహరించడం వల్ల...

మేషం: వనసమారాధనలు వేడుకల్లో చురుకుగా పాల్కొంటారు. ఉపాధ్యాయులకు గుర్తింపు, రాణింపు లభించగలదు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. విద్యార్థులలో నూతన ఉత్తేజం కానవస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు కలిసివస్తుంది. చేపట్టిన పనులు పూర్తికాక విసుగు కలిగిస్తాయి. 
 
వృషభం: ప్రయాణాల్లో నూతన పరిచయాల వలన ఇబ్బందులను ఎదుర్కుంటారు. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. ప్రైవేటు సంస్థలలోని వారి నిర్లక్ష్యం, మతిమరుపు వలన యాజమాన్యం కోపతాపాలకు గురికావలసి వస్తుంది.    
 
మిధునం: చిన్నతరహా పరిశ్రమలలోవారికి పురోభివృద్ధి. దైవ, పుణ్య కార్యాలలో ఇతోధికంగా వ్యవహరిస్తారు. ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు పురోభివృద్ధి. దైవదర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. ఏ మాత్రం పొదుపు సాధ్యం కాదు.  
 
కర్కాటకం: కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ వ్యాపారులకు కలిసిరాగలదు. లౌక్యంగా వ్యవహరించడం వలన కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అతి కష్టంమ్మీద అనుకూలిస్తాయి.  
 
సింహం: ప్రేమ వ్యవహారాల్లో లౌక్యంగా మెలగండి. కళత్ర మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రాజకీయవర్గాల వారికి విదేశీ పర్యటనలు తప్పవు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు అమలు చేస్తారు. రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకోవాలి. 
 
కన్య: పత్రిక, ప్రైవేటు సంస్థల్లోని వారికి ఓర్పు అవసరం. ఉద్యోగులు విధి నిర్వహణలో చికాకులను ఎదుర్కుంటారు. మీ ఆవేశం, అవివేకం వలన వ్యవహారం చెడే ఆస్కారం ఉంది. భాగస్వామ్యుల మధ్య అవగాహన కుదరదు. వైజ్ఞానిక శాస్త్ర విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు. 
 
తుల: వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం లోపిస్తుంది. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు. చేతి వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఓర్పు, నేర్పుతో మీరు అనుకున్నది సాధిస్తారు.  
 
వృశ్చికం: మీ ప్రయాణాలు, కార్యక్రమాలకు స్వల్ప ఆటంకాలెదరవుతాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. మిత్రులను, ప్రముఖులను కలుసుకుంటారు. ఒకరికి సలహా ఇచ్చి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. ఉద్యోగస్తులకు రావలసిన మెడికల్ క్లయింలు, అలవెన్సులు మంజూరవుతాయి.  
 
ధనస్సు: విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. విదేశీయానం కోసం చేసే యత్నాలు కలిసివస్తాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. విపరీతమైన ఖర్చులు, ధనం నిల్వచేయకపోవడం వలన ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. స్త్రీలు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కుంటారు.   
 
మకరం: స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఊహించని ఇబ్బందులెదురవుతాయి. విద్యార్థులకు, ఉపాధ్యాయులు, సహచరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉపాధి పథకాలపై నిరుద్యోగులు దృష్టి సారిస్తారు.     
 
కుంభం: ఉద్యోగస్తుల నిర్లక్ష్యం వలన అధికారుల నుండి మాటపడవలసివస్తుంది. ఆత్మీయులతో కలిసి విందులు, పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏదైనా స్థిరాస్తి అమ్మకం వాయిదా పడడం మంచిది. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. వైద్య రంగాల వారికి ఏకాగ్రత, మెళకువ అవసరం.   
 
మీనం: ఆర్థిక, కుటుంబ సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి ఊహించని చికాకులెదురవుతాయి. కుటుంబీకుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. దూరప్రయాణాలు, బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. మీ అవసరాలకు కావలసిన వనరులు సర్దుబాటుకాగలవు.