శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 23 నవంబరు 2018 (18:39 IST)

భారత్-ఆస్ట్రేలియా టీ-20.. రెండో మ్యాచ్ రద్దు.. కోహ్లీ సేన ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు

మొన్నటికి మొన్న కాశ్మీర్‌పై కామెంట్స్ చేసిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది.. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ విషయంలో ధోనీనే బెస్ట్ అని.. విరాట్ ఇంకా ధోనీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా వుందని అఫ్రిది అన్నాడు. బ్యాట్స్‌‌మెన్ విషయంలో ఓకే కానీ కెప్టెన్సీ విషయంలో మాత్రం కోహ్లీ ఇంకా నేర్చుకోవాలన్నాడు. 
 
కోహ్లీ తన ఫేవరెట్ బ్యాట్స్‌మని కూడా అఫ్రిది వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటిస్తోంది. ఈ పర్యటనపై కూడా అఫ్రిది కామెంట్స్ చేస్తే.. ఆసీస్ గడ్డపై గెలవాలంటే.. టీమిండియా బ్యాట్స్‌మెన్ సామర్థ్యానికి మించి రాణించాల్సి వుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆసీస్ పిచ్‌లు బౌన్స్‌కు అనుకూలించవు. భారతీయ బ్యాట్స్‌మెన్లు బాగా ఆడగలిగితే.. సిరీస్ కైవసం చేసుకునే అవకాశం వుంటుందని అఫ్రిది స్పష్టం చేశాడు. 
 
ఇదిలా ఉంటే.. భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టీ-20 వర్షం కారణంగా రద్దు అయ్యింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలనుకున్న కోహ్లీ సేన ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 19 ఓవర్ల తర్వాత మొదలైన వర్షం ఏమాత్రం ఆగకపోవడంతో.. 19 ఓవర్లలో 137 పరుగుల టార్గెట్ విధించారు.  దాన్ని 11 ఓవర్లలో 90 పరుగులకు కుదించారు. 
 
అయినా వీడని వర్షం కారణంగా చివరికి ఐదు ఓవర్లలో 46 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. కానీ వర్షం రావడంతో టీమిండియా చేజింగ్ మొదలెట్టక ముందే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో మూడు ట్వంటీ-20ల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇంకా 1-0 ఆధిక్యంలో వుంది.