వరల్డ్ ట్వంటీ-20.. ఇంగ్లండ్‌పై ప్రతీకారానికి భారత మహిళల జట్టు సై
వరల్డ్ ట్వంటీ-20లో భారత మహిళల జట్టు అదరగొట్టేస్తోంది. ఈ జట్టు గ్రూప్ స్థాయిలో అదరగొట్టి.. సెమీఫైనల్లోకి చేరింది. ఇక శుక్రవారం జరిగే సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ టీమిండియాతో తలపడనుంది. గత ఏడాది ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడింది. ఇందుకు బదులు ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది.
ఇక చివరి వీగ్ మ్యాచ్‌లో ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత మహిళల జట్టు అదే జోరును కొనసాగించాలనుకుంటుంది. టీమిండియా ప్రధానంగా బ్యాటింగ్‌పైనే ఆశలు పెట్టుకుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించింది. ఇదే తరహాలో ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లోనూ హర్మన్ అదరగొట్టేందుకు సిద్ధంగా వుంది.
కాగా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న భారత్ .. పటిష్ట ఇంగ్లండ్‌ల మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశం వుంది. తొలి సెమీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్, మూడుసార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. గ్రూప్-ఎలో అజేయంగా సెమీఫైనల్‌కు చేరిన వెస్టిండీస్ టైటిల్ నిలబెట్టుకోవాలనే కసితో వుంది. మరో సెమీఫైనల్‌లో భారత్-ఇంగ్లండ్ పోటీపడనున్నాయి.