బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 22 నవంబరు 2018 (11:36 IST)

ఆఫీసులకు డుమ్మా కొట్టడంలో భారతీయులే ఫస్ట్

తమ విధులకు డుమ్మా కొట్టడంలో భారతీయులో మొదటి స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాల ప్రజలతో పోల్చితే భారతీయులే అధిక సంఖ్యలో సెలవులు (75) తీసుకుంటారని ఎక్స్‌పీడియా అనే సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. 
 
ఏ దేశ ప్రజలు అధికంగా సెలువులు తీసుకుంటారన్న అంశంపై ఈ సంస్థ ఓ సర్వే చేసింది. ఇందులో భారతీయులు అత్యధిక రోజులు సెలవులు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నట్టు తేలింది. ఆ తర్వాత స్థానంలో 72 శాతంతో సౌత్ కొరియా, 69 శాతంతో హాంకాంగ్ దేశాలు ఉన్నాయి. 
 
ఈ సర్వేలో దాదాపు 53 శాతం మంది భారతీయులు తమకు దొరికే వాటికంటే తక్కువ సెలవులు తీసుకుంటున్న వారిలో 35 శాతం మంది మాత్రమే ఉన్నారని తేలింది. అలాగే, ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నపుడు, సెలవులు దొరకని కారణంగా తమ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నవారు 68 శాతం మంది ఉన్నట్టు తెలిపారు. పై అధికారులు కూడా తమ కింది స్థాయి సిబ్బందికి సెలవులు ఇవ్వడం లేదని ఈ సర్వేలో వెల్లడైంది.