శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 24 సెప్టెంబరు 2018 (10:28 IST)

యూటర్న్ తీసుకుని భర్తతో వెకేషన్‌కు వెళ్లిపోయింది.. ఎవరు?

అక్కినేని వారింటి కోడలిగా మారిన టాప్ హీరోయిన్ సమంతకు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. తాజాగా యూటర్న్ సినిమా ద్వారా మంచి మార్కులు, కలెక్షన్లు తన ఖాతాలో వేసుకున్న సమంత.. కాస్త బ్రేక్ దొరికే సరికి.. భర్త చైతూత

అక్కినేని వారింటి కోడలిగా మారిన టాప్ హీరోయిన్ సమంతకు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. తాజాగా యూటర్న్ సినిమా ద్వారా మంచి మార్కులు, కలెక్షన్లు తన ఖాతాలో వేసుకున్న సమంత.. కాస్త బ్రేక్ దొరికే సరికి.. భర్త చైతూతో కలిసి ట్రిప్పేసింది. ఈ ఏడాది రంగస్థలం, మహానటి, అభిమన్యుడు, యూటర్న్ వంటి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో తర్వాతి సినిమా భర్త నాగచైతన్యతో కలసి చేయనున్న సమంత, ఈలోగా చిన్న బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకుని, అనుకున్నదే తడవుగా విహారయాత్రకు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్‌తో సమంత పంచుకుంది. 'ఫైనల్లీ వెకేషన్' అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. 
 
అక్టోబర్ 6న సమంత, చైతూల వివాహ దినోత్సవం కాగా, అదే రోజున వీరి కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఆ సమయానికి సమంత తన టూర్‌ను ముగించుకుని తిరిగి వస్తుందని సమాచారం.