శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 17 సెప్టెంబరు 2018 (14:21 IST)

''రంగస్థలం'' కొత్త రికార్డు.. రంగమ్మా.. మంగమ్మా.. పాటకు 10 కోట్ల వ్యూస్

''రంగస్థలం'' సినిమా రికార్డులను బ్రేక్ చేసింది. రామ్ చరణ్, సమంతల కాంబోలో తెరకెక్కిన రంగస్థలం సినిమా అఖండ విజయాన్ని సాధించింది. కలెక్షన్ల పరంగా కుమ్మేసింది. దర్శకుడు సుకుమార్ 1985 నాటి బ్యాక్‌డ్రాప్‌లో

''రంగస్థలం'' సినిమా రికార్డులను బ్రేక్ చేసింది. రామ్ చరణ్, సమంతల కాంబోలో తెరకెక్కిన రంగస్థలం సినిమా అఖండ విజయాన్ని సాధించింది. కలెక్షన్ల పరంగా కుమ్మేసింది. దర్శకుడు సుకుమార్ 1985 నాటి బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. 
 
తాజాగా ఈ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది. గోదావరి యాసతో 'రంగమ్మా, మంగమ్మా... ఏం పిల్లడూ.. ' అనే పాట సోషల్ మీడియాలో 10 కోట్ల వ్యూస్‌ను దాటేసి రికార్డు పుటల్లోకి ఎక్కింది. 100మిలియన్లు సాధించిన రెండో తెలుగు పాటగా రంగమ్మా.. మంగమ్మా నిలిచింది. 
 
దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, మానసి వాయిస్‌కు తోడు సమంతల ఎక్స్‌ప్రెషన్స్‌కు ఈ పాట కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కాగా బాహుబలిలోని సాహోరో బాహుబలి పాట తెలుగులో మొదటి 100మిలియన్ల వ్యూస్‌ను సాధించి, రికార్డు సృష్టించింది.