శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: బుధవారం, 5 సెప్టెంబరు 2018 (20:39 IST)

రాజమౌళి మరో యుద్ధం... దిగాలుగా కూర్చున్న నిర్మాతలు.. ఎందుకు?

రాజమౌళి సినిమా అంటేనే ఒక కొత్తదనం. మామూలు సినిమాల కన్నా రాజమౌళి సినిమా భారీ బడ్జెట్‌తో ఉంటుంది. తన సినిమాలతో మార్కెట్‌ను కొత్తగా క్రియేట్ చేసి తెలుగు సినిమా స్థాయిని పెంచడం ఆయన వర్కింగ్ స్టైల్. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా రేంజ్‌ను హాలీవుడ్ రేంజ్‌క

రాజమౌళి సినిమా అంటేనే ఒక కొత్తదనం. మామూలు సినిమాల కన్నా రాజమౌళి సినిమా భారీ బడ్జెట్‌తో ఉంటుంది. తన సినిమాలతో మార్కెట్‌ను కొత్తగా క్రియేట్ చేసి తెలుగు సినిమా స్థాయిని పెంచడం ఆయన వర్కింగ్ స్టైల్. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా రేంజ్‌ను హాలీవుడ్ రేంజ్‌కు తీసుకెళ్ళాడు. నెక్ట్స్ రాజమౌళి తీసే సినిమాకు బడ్జెట్ ఎంతన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. శంకర్ తీస్తున్న 2.0 సినిమా కన్నా రాజమౌళి సినిమా బడ్జెట్ ఎక్కువగా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. 
 
రాజమౌళి సినిమా అంటేనే గ్రాండ్‌గా ఉంటుందని ఎవరైనా ఫిక్సయి పోవాల్సిందే. ఆయన సినిమా అంటేనే కళ్ళు చెదిరే ఎఫెక్ట్స్ ఉంటాయని ఎవరైనా చెబుతారు. ఎంత బడ్జెట్ ఇస్తే అంత గొప్పగా తీస్తారు రాజమౌళి. మగధీర సినిమా తీసినప్పుడు అబ్బో అన్నారు. బాహుబలి సినిమా తీశాక ఇక రాజమౌళిని మించినోడు ఇండియాలోనే ఎవరూ లేరన్నారు. అది జక్కన్న విజువలైజేషన్.
 
మొదట్లో మల్టీస్టారర్ సినిమా కోసం 100 కోట్ల రూపాయలు అనుకున్నారట రాజమౌళి. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో రాజమౌళి సినిమా తీయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ చివరి వారంలోగానీ లేకుంటే జనవరి మొదటివారంలో గానీ సెట్స్ పైకి వెళ్ళనుంది. కానీ ఇప్పుడా సినిమాకు 250 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని నిర్మాతలకు చెప్పారట రాజమౌళి. దీంతో నిర్మాతలు దిగాలుగా కూర్చుండిపోయారట. 
 
కానీ రాజమౌళి తీసే సినిమాలో ఎంత డబ్బు ఖర్చు పెడితే అంతకన్నా 5 రెట్లు ఎక్కువగా వస్తుందని నిర్మాతలందరికీ తెలిసిందే. ఎవరు అధైర్య పడవద్దని రాజమౌళి మల్టీస్టారర్‌తో తీయనున్న సినిమా నిర్మాతలకు చెబుతున్నారు. దీన్నిబట్టి రాజమౌళి మళ్ళీ మరో యుద్ధాన్ని ప్రారంభించారన్న ప్రచారం తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతోంది. మరి చెర్రీ-ఎన్టీఆర్‌లతో ఆ లెవల్లో ఏం తీయబోతున్నారో జక్కన్న?