సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (15:40 IST)

జపాన్‌లో రచ్చ చేస్తున్న 'మగధీర' : థాంక్యూ జపాన్... అంటూ చెర్రీ ట్వీట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఎస్ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'మగధీర'. ఈ సినిమా రామ్ చరణ్ సినీ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. టాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఎస్ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'మగధీర'. ఈ సినిమా రామ్ చరణ్ సినీ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. టాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
 
2009లో వచ్చిన ఈ చిత్రాన్ని మరోసారి జపాన్ థియేటర్లలో విడుద‌ల చేశారు. భారతీయ సినిమాలకు జపాన్ సినీ మార్కెట్‌లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ క్ర‌మంలో 'మగధీర' సినిమా అప్పట్లో జపాన్‌లో సబ్‌టైటిల్స్‌తో విడుదలైంది. 
 
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కించిన చిత్రం మగధీర. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. అయితే భారత సినిమాలకు జపాన్‌లో మంచి మార్కెట్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 
 
'మగధీర' విడుదలైన సమయంలో ఎస్‌ఎస్ రాజమౌళికి జపాన్‌లో ఉన్న క్రేజ్ తక్కువే. అయితే 'బాహుబలి' విడుదలైన తర్వాత ఒక్కసారిగా జక్కన్న పేరు జపాన్‌తోపాటు వివిధ దేశాల్లో మార్మోగిపోయింది. జపాన్‌లో రాజమౌళి క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని 'మగధీర' సినిమాను అక్కడ మళ్లీ విడుదల చేశారు నిర్మాతలు. ఈ సినిమా కేవలం 10 రోజులలో సుమారుగా రూ.17 కోట్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. 
 
రామ్ చ‌రణ్ న‌టించిన 'మ‌గ‌ధీర' చిత్రానికి ల‌భిస్తున్న ఇంతటి ఆదరణ గురించి తెలుసుకున్న మన కాలభైరవ(మెగా పవర్ స్టార్ రామ్ చరణ్) ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్త పరిచాడు. "థాంక్యూ జపాన్.. మాపై మీరు చూపిస్తున్న ప్రేమ‌ని చూస్తుంటే నిజంగా ఆనందంగా అనిపిస్తోంది. ఇది ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోతుంది. ఇలాంటి చిరస్మరణీయమైన సినిమాను నాకిచ్చినందుకు రాజమౌళిగారికి చాలా పెద్ద థాంక్యూ. ఇప్పటికీ ఈ సినిమా వచ్చి 10 సంవత్సరాలైందంటే నమ్మలేకపోతున్నా" అని తెలిపాడు.