గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Srinivas
Last Modified: శనివారం, 25 ఆగస్టు 2018 (18:03 IST)

విశాఖ, అమరావతిలపై రామ్ చరణ్ టార్గెట్... ఏం చేయబోతున్నాడో తెలుసా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఓ వైపు హీరోగా న‌టిస్తూనే.. నిర్మాత‌గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. తండ్రి చిరుతో సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా నిర్మిస్తూనే బోయ‌పాటి శ్రీనుతో చేస్తున్న సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడు. ఇదిలా ఉంటే... ఇప్పుడు ఆంధ్ర‌ప

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఓ వైపు హీరోగా న‌టిస్తూనే.. నిర్మాత‌గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. తండ్రి చిరుతో సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా నిర్మిస్తూనే బోయ‌పాటి శ్రీనుతో చేస్తున్న సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడు. ఇదిలా ఉంటే... ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఫిల్మ్ స్టూడియో క‌ట్ట‌డానికి భారీ ప్లాన్ రెడీ చేస్తున్నాడ‌ని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో మరియు అమరావతిలో చలనచిత్ర నిర్మాణానికి ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటుంది.
 
దీంతో టాలీవుడ్ చిత్ర నిర్మాతలు వివిధ రకాలుగా వారి ప్రణాళికలతో ఏపీ గ‌వ‌ర్న‌మెంట్‌ని క‌లుస్తున్నారు. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం... వైజాగ్ బీచ్ రోడ్ ప్రాంతంలో ఫిల్మ్ స్టూడియోని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో రామ్ చరణ్ ఉన్నాడట. గ‌తంలోను రామ్ చ‌ర‌ణ్ ఫిల్మ్ స్టూడియో క‌ట్ట‌నున్న‌ట్టు టాక్ వ‌చ్చింది. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త నిజ‌మా కాదా అనేది తెలియాల్సి వుంది.