శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By pnr
Last Updated : మంగళవారం, 21 ఆగస్టు 2018 (11:47 IST)

'ఈ యుద్ధం ఎవరిది?' అంటూ ముందుకొచ్చిన సైరా.. నెట్టింట దుమ్మురేపుతోంది...

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు ఆగస్టు 22వ తేదీన జరుగనున్నాయి. కానీ, ఆయన అభిమానులకు మాత్రం ఒక్కరోజు ముందుగానే వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే.. చిరంజీవి నటించిన 151వ చిత్రం సైరా నరసింహా రెడ్డి

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు ఆగస్టు 22వ తేదీన జరుగనున్నాయి. కానీ, ఆయన అభిమానులకు మాత్రం ఒక్కరోజు ముందుగానే వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే.. చిరంజీవి నటించిన 151వ చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం టీజర్‌ను కొన్ని నిమిషాల క్రితం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ టీజర్ వస్తూనే నెట్టింట దుమ్మురేపుతోంది. ఈ టీజర్ రిలీజ్ అయిన కొన్ని నిమిషాల్లో వేలల్లో వ్యూస్ వచ్చాయి.
 
ఈ చిత్రం టీజర్‌లో బ్రిటీష్ వారి కోటను, ఆపై ఓ గ్రామంలో గుర్రపు బండ్లు వెళుతూ ఉండటం, ఓ భారతీయుడి వీపునే మెట్టుగా చేసుకుని బ్రిటీష్ అధికారి బండి దిగడాన్ని చూపారు. ఆపై అసలు సీన్ మొదలైంది. కమ్ముకొస్తున్న మేఘాల మధ్య, బ్రిటీష్ వారి కోటపై జెండా పట్టుకుని నిలబడిన నరసింహా రెడ్డిని చూపించారు. ఓ మర ఫిరంగిని పేల్చుతున్న సీన్‌ను, 'ఈ యుద్ధం ఎవరిది?' అని నరసింహారెడ్డి గర్జించగా, 'మనది' అని నినదిస్తున్న ఆయన అనుచరులను చూపించారు. అపై బ్రిటీష్ అధికారి "నరసింహారెడ్డి..." అని ఆగ్రహంగా అరవడం, గుర్రంపై బ్రిటీష్ సైనికుల మీదకు నరసింహారెడ్డి దూసుకు రావడాన్ని చూపించారు. కొన్ని క్షణాల్లోనే వేల హిట్స్ తెచ్చుకున్న టీజర్‌ను మీరూ చూసేయండి. 
 
కాగా, ఈ చిత్రాన్ని మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కొణిదల ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిస్తుండగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదీ సంగీత బాణీలను సమకూర్చుతున్నారు. చిరంజీవి భార్య సురేఖ సమర్పిస్తున్నారు.