బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: శనివారం, 18 ఆగస్టు 2018 (22:04 IST)

కేరళ వరద బాధితులకు మెగా ఫ్యామిలీ రూ. 51 లక్షల విరాళం... సిద్ధార్థ్

కేరళను ముంచెత్తిన వరద బీభత్సం పట్ల మెగాస్టార్ చిరంజీవి కుటుంబం తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా వారి కుటుంబం రూ. 51 లక్షల రూపాయాల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆన్‌లైన్ ద్వారా పంపింది. దీనితో పాటు పది లక్షల రూపాయల విలువ చేసే మం

కేరళను ముంచెత్తిన వరద బీభత్సం పట్ల మెగాస్టార్ చిరంజీవి కుటుంబం తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా వారి కుటుంబం రూ. 51 లక్షల రూపాయాల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆన్‌లైన్ ద్వారా పంపింది. దీనితో పాటు పది లక్షల రూపాయల విలువ చేసే మందులు, ఆహార పదార్థాలు, ఆరోగ్య పరిశుభ్రతా వస్తువులను వరద బాధిత కుటుంబాలకు అందచేసేందుకు కేరళకు పంపారు.
 
మరోవైపు నటుడు సిద్ధార్థ్ రూ. 10 లక్షల విరాళాన్ని కేరళ వరద బాధితులకు అందజేశారు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి పంపించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ #KeralaDonationChallenge ని స్టార్ట్ చేసారు.