సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: శనివారం, 18 ఆగస్టు 2018 (22:11 IST)

చిరుతో కలిసి తాగిన ఆ కాఫీ నా లైఫ్‌లో బెస్ట్ : నిర్మాత బ‌న్నీ వాస్

గీత గోవిందం ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో తెలిసిందే. ఈ చిత్రం మెగాస్టార్‌కి ఎంత‌గానో న‌చ్చింది. అందుక‌నే ఈ సినిమా నిర్మించిన టీమ్‌ని పిలిపించి అభినందించారు. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత బ‌న్నీ వాస్ మాట్లాడుతూ... ఏదైనా సినిమా గురించి స్టార్స్ అంద

గీత గోవిందం ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో తెలిసిందే. ఈ చిత్రం మెగాస్టార్‌కి ఎంత‌గానో న‌చ్చింది. అందుక‌నే ఈ సినిమా నిర్మించిన టీమ్‌ని పిలిపించి అభినందించారు. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత బ‌న్నీ వాస్ మాట్లాడుతూ... ఏదైనా సినిమా గురించి స్టార్స్ అందరు ట్వీట్ చేస్తుంటే, నా సినిమా గురించి అలా ట్వీట్ చేస్తే చూడాలి అని ఉండేది. బన్నీ ఎడిటింగ్ రూమ్‌లో సినిమా చూసి హగ్ చేసుకున్నాడు. మహేష్ బాబు గారు, చరణ్ బాబు సినిమా గురించి ట్వీట్ చేసినప్పుడు చాలా ఆనందపడ్డాను. నా కోరిక ఈ సినిమాతో తీరిపోయింది.
 
చిరంజీవి గారంటే మా అందరికీ సింహంలా. ఈ ఫ్యామిలీతో నాకు ఎప్పటినుండో అనుబంధం ఉన్నా ఆయనతో 5 నిమిషాలకి మించి మాట్లాడింది లేదు. ఆయనంటే ఎంతో గౌరవం, కొంచెం భయం కూడా. గీత గోవిందం రిలీజ్ అయ్యాక ఆయన పిలిపించి గంట సేపు మాట్లాడారు. అప్పుడు ఆయనతో కలిసి తాగిన కాఫీ నా లైఫ్‌లో బెస్ట్ కాఫీ. ముందు దర్శకుడు పరశురామ్‌ని నమ్మాను. తర్వాత తను చెప్పిన కథను నమ్మాను. మా హీరో విజయ్ దేవరకొండ కూడా కథని నమ్మారు. కథ మీద దర్శకుడి మీద ఉంచిన నమ్మకమే ఈ ఘన విజయానికి కారణం అని అన్నారు.