శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: బుధవారం, 12 సెప్టెంబరు 2018 (12:09 IST)

రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్ పైన క్లారిటీ ఇచ్చిన స‌మంత‌..!

స‌మంత న‌టించిన తాజా చిత్రం యూ ట‌ర్న్. థ్రిల్ల‌ర్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో స‌మంత జ‌ర్న‌లిస్టుగా న‌టించింది. భూమిక చావ్లా, ఆది పినిశెట్టి, రాహుల్ ర‌వీంద్ర‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ నెల 13న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా

స‌మంత న‌టించిన తాజా చిత్రం యూ ట‌ర్న్. థ్రిల్ల‌ర్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో స‌మంత జ‌ర్న‌లిస్టుగా న‌టించింది. భూమిక చావ్లా, ఆది పినిశెట్టి, రాహుల్ ర‌వీంద్ర‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ నెల 13న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా స‌మంత మీడియాతో మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను తెలియ‌చేసింది. రెగ్యులర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించ‌ను. పాత్ర‌కు ప్రాధాన్యం ఉన్న పాత్ర‌ల‌ను మాత్ర‌మే చేస్తాన‌ని చెప్పింది.
 
రాజ‌మౌళి ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో స‌మంత న‌టిస్తుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే విష‌యం గురించి స‌మంత‌ని అడిగితే... ఇందులో ఏమాత్రం వాస్త‌వం లేదు. ఇదేకాదు... రాజ‌మౌళి సినిమాలో స‌మంత న‌టించ‌న‌ని చెప్పింది అనేది కూడా అవాస్త‌వం అని సూటిగా చెప్పేసింది. కాబట్టి.. జ‌క్క‌న్న మ‌ల్టీస్టార‌ర్స్‌లో స‌మంత న‌టించ‌డం లేద‌నేది క‌న్‌ఫ‌ర్మ్. మ‌రి.. ఎవ‌రిని సెలెక్ట్ చేస్తారో చూడాలి.