గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (12:17 IST)

స‌మంత బాగా బాధ‌ప‌డింద‌ట‌... అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన నాగ్..!

దేవ‌దాస్ ఆడియో పార్టీకి నాగార్జున‌, అమ‌ల‌, అఖిల్, సుశాంత్, నాగ సుశీల‌తో పాటు స‌మంత కూడా వ‌చ్చింది. మ‌ణిశ‌ర్మ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన దేవ‌దాస్ పాట‌లు ఆల్రెడీ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ వేడుక‌లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ... వినాయ‌క చ‌వితి రో

దేవ‌దాస్ ఆడియో పార్టీకి నాగార్జున‌, అమ‌ల‌, అఖిల్, సుశాంత్, నాగ సుశీల‌తో పాటు స‌మంత కూడా వ‌చ్చింది. మ‌ణిశ‌ర్మ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన దేవ‌దాస్ పాట‌లు ఆల్రెడీ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ వేడుక‌లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ... వినాయ‌క చ‌వితి రోజున ఉద‌యం స‌మంత చాలా బాధ‌ప‌డింది. ఫోన్ చేసి శైల‌జారెడ్డి అల్లుడు సినిమాకి రివ్యూస్ స‌రిగా రాలేద‌ని చెప్పింది. ఏం ఫర‌వాలేదు సాయంత్రానికి అంతా స‌ర్ధుకుంటుంది అని చెప్పాను.
 
చెప్పిన‌ట్టుగానే జ‌రిగింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఫోన్ చేసి యూ ట‌ర్న్ మూవీకి రివ్యూస్ బాగా వ‌చ్చాయ్ కానీ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ గంట మోగ‌డం లేద‌ని చెప్పింది. ఏం ఫ‌ర‌వాలేదు ఆదివారానికి సెట్ అవుతుంద‌న్నాను. అలాగే జ‌రిగింది. ఒకే రోజున భార్య‌భ‌ర్త‌ల సినిమాలు ఎక్క‌డైనా రిలీజ్ అవుతాయా..? ఇక్క‌డ జ‌రిగింది. రెండు సినిమాలు బాగా ఆడుతున్నాయి అని చెప్పారు. ఇక మొన్న వినాయ‌క చ‌వితి వ‌చ్చింది. అక్టోబ‌ర్‌లో ద‌స‌రా వ‌స్తుంది. కానీ.. ఈ నెల 27న దేవ‌దాస్ పండ‌గ వ‌స్తుంది అంటూ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు. అదీ... సంగ‌తి..!