శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 జులై 2018 (10:59 IST)

పాకిస్థాన్ జైళ్ళలో 471 మంది భారతీయులు.. విడుదలకు మార్గమేది?

పాకిస్థాన్ జైళ్లలో 471 మంది భారతీయులు మగ్గుతున్నారు. వీరిలో 418 మంది జాలర్లు ఉన్నారు. వీరందరి విడుదలకు మార్గం కనిపించడం లేదు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం స

పాకిస్థాన్ జైళ్లలో 471 మంది భారతీయులు మగ్గుతున్నారు. వీరిలో 418 మంది జాలర్లు ఉన్నారు. వీరందరి విడుదలకు మార్గం కనిపించడం లేదు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం సుప్రీంకోర్టుకు ఒక నివేదికను సమర్పించింది.
 
ఈ నివేదికలో భారత్‌ జైళ్లలో 357 పాకిస్థానీయులు ఉన్నారని, వారిలో 108 మంది మత్స్యకారులని పేర్కొంది. 2016లో భారత్‌ 114 మంది పాక్‌ ఖైదీలను విడుదల చేయగా, పాకిస్థాన్‌ 941 మంది ఖైదీలను విడుదల చేసింది. 
 
ఖైదీల సమస్యపై చర్చించడానికి ఇరు దేశాల ప్రతినిధులతో 2007 జనవరిలో న్యాయ కమిటీ ఏర్పాటయింది. ఇందులో ఒక్కో దేశం తరఫున నలుగురు విశ్రాంత న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. అయితే రెండు దేశాల మధ్య చర్చలు రద్దవడంతో 2013 తరువాత ఈ కమిటీ సమావేశం జరగడం లేదు. ఫలితంగా పాక్ జైళ్ళలో భారతీయ జాలర్లు మగ్గుతున్నారు.