శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 17 మే 2018 (10:42 IST)

ఐపీఎల్ 2018 : ఒత్తిడితో పంజాబ్ ఓటమి.. వెంట్రకవాసితో ముంబై గెలుపు

ఐపీఎల్ 2018టోర్నీలో భాగంగా, బుధవారం రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - ముంబై ఇండియన్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఒత్తిడిని జయించలేక పంజాబ్ ఆటగాళ్లు చేతులెత్తే

ఐపీఎల్ 2018టోర్నీలో భాగంగా, బుధవారం రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - ముంబై ఇండియన్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఒత్తిడిని జయించలేక పంజాబ్ ఆటగాళ్లు చేతులెత్తేస్తే... ముంబై ఇండియన్స్ మాత్రం వెంట్రుకవాసిలో గెలుపును సొంతం చేసుకున్నారు.
 
ఈ మ్యాచ్‌లో టాస్‌ కోల్పోయి మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లు పొలార్డ్‌ 23 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50, క్రునాల్‌ పాండ్యా 32, సూర్యకుమార్‌ యాదవ్‌ 27 చొప్పున పరుగులు చేశారు. టై 16 పరుగులకు 4 వికెట్లు పడగొట్టగా అశ్విన్‌ 18 పరుగులకు రెండు వికెట్లు తీశాడు. 
 
ఆ తర్వాత 187 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టులో రాహుల్‌ 60 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 94 రన్స్ మెరుపులకు ఫించ్‌ 35 బంతుల్లో 46 జోరు తోడవడంతో 187 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేరేలా కనిపించింది. అయితే వీరిద్దరి నిష్క్రమణతో మిగిలిన బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. ఫలితంగా 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులే చేసింది. బుమ్రా 3, మెక్లెనగన్‌ 2 వికెట్లు సాధించడంతో బుమ్రాకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. 
 
అయితే, బుధవారం నాటి మ్యాచ్‌లో ముంబై ఓడిపోయివుంటే ప్లే ఆఫ్ రేసు నుంచి బయటకు వచ్చినట్టే. పంజాబ్ జట్టు ఓడినా రేసులోనే ఉంటుంది. ఇక పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న ముంబై జట్టు తన చివరి మ్యాచ్‌ని ఢిల్లీతో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం ముంబై జట్టుకు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఈ మ్యాచ్ గెలిస్తే ముంబై మరో సమీకరణంతో అవసరం లేకుండా ప్లే ఆఫ్‌కు చేరుతుంది. ఇక ఓడిపోతే మాత్రం ఇతర జట్ల జయాపజయాలు ముంబై అవకాశాలపై ప్రభావం చూపుతాయి.