పప్పీ.. ఎలుగుబంటిగా మారింది.. రోజుకు 2 బకెట్ల న్యూడిల్స్ తినేది..
పప్పీ అనుకుని ఓ ఎలుగుబంటిని పెంచుకుంది ఓ మహిళ. అంతే అది ఎలుగబంటి అని తెలుసుకుని షాకైంది. ఈ ఘటన చైనాలోని యునాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిన్న పప్పీ డాగ్‌ను రెండేళ్ల క్రితం ఇంటికి తెచ్చుక
పప్పీ అనుకుని ఓ ఎలుగుబంటిని పెంచుకుంది ఓ మహిళ. అంతే అది ఎలుగబంటి అని తెలుసుకుని షాకైంది. ఈ ఘటన చైనాలోని యునాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిన్న పప్పీ డాగ్‌ను రెండేళ్ల క్రితం ఇంటికి తెచ్చుకుంది చైనా మహిళ. ఓ నల్లని జంతువును శునకంగా భావించి ఇంటికి తెచ్చుకున్న ఆమెకు రెండేళ్ల తర్వాత అది పప్పీ కాదని ఎలుగుబంటి అని తెలిసింది.
అంతే.. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చింది. శునకం అనుకుని ఇంటికి తెచ్చుకుంటే అది 200 కేజీల బరువు పెరిగిందని.. అది ఎలుగుబంటి అని తెలుసుకున్నాక జడుసుకుని భయంతో.. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చానని వెల్లడించింది.
ఇక అటవీ శాఖాధికారులు వెంటనే ఆమె ఇంటికి చేరుకుని ఆ ఎలుగుబంటిని బోనులో బందించారు. ఆ ఎలుగుబంటి చాలా ప్రమాదకరమైందని తెలిపారు. ఆ ఎలుగుబంటి రోజుకు రెండు బకెట్ల న్యూడిల్స్ తినేదని.. దానికి లిటిల్ బ్లాక్ అని పేరు పెట్టుకుని పెంచుకున్నానని.. కానీ ఎలుగుబంటి అని తెలిశాక భయపడ్డానని తెలిపింది.