సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 13 మే 2018 (13:32 IST)

ముంబై మారణహోమం.. ఉగ్రవాదుల్ని పురమాయించింది.. పాకిస్థానే: నవాజ్ షరీఫ్

ముంబై మారణహోమాన్ని భారతీయులు అంత సులువుగా మరిచిపోరు. 2008లో దాదాపు పది మంది పాకిస్థాన్ జీహాదీలు దేశ వాణిజ్య నగరమైన ముంబై నగరంలో కాల్పులతో పాటు బాంబు దాడులకు తెగబడ్డారు. 2008 నవంబర్ 26 నుంచి 29వరకు మూడ

ముంబై మారణహోమాన్ని భారతీయులు అంత సులువుగా మరిచిపోరు. 2008లో దాదాపు పది మంది పాకిస్థాన్ జీహాదీలు దేశ వాణిజ్య నగరమైన ముంబై నగరంలో కాల్పులతో పాటు బాంబు దాడులకు తెగబడ్డారు. 2008 నవంబర్ 26 నుంచి 29వరకు మూడు రోజుల పాటు దారుణ మారణకాండ కొనసాగింది. ఈ దాడిలో 173 మంది చనిపోగా 308 మంది వరకూ గాయపడ్డారు.
 
దక్షిణ ముంబైలో ఎనిమిది దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక రాజధాని ముంబై (26/11)లో మారణహోమం సృష్టించాల్సిందిగా ఉగ్రవాదుల్ని పురమాయించింది పాకిస్థానేనని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్ అంగీకరించారు. ముంబై మారణహోమానికి పాకిస్థానే కారణమని ఓ ఇంటర్వ్యూలో షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
అలాగే పాకిస్థాన్‌లో ఉగ్రవాద సంస్థలు క్రియాశీలంగా ఉన్నాయన్నారు. పాక్ మిలిటెంట్లను రాజ్యాంగేతర శక్తులుగా పిలవాలని షరీఫ్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులకు సరిహద్దులు దాటి అమాయకులను చంపేందుకు అనుమతించాలా? ముంబైలో 150 మందిని చంపేందుకు ఉగ్రవాదులకు మేం అనుమతి ఇవ్వాలా? ఉగ్రదాడులపై పెండింగ్‌లో ఉన్న కేసులపై ఎందుకు విచారణ పూర్తి చేయరని నవాజ్ షరీఫ్ అడిగారు.