శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (10:32 IST)

ఆడ కుక్కపిల్లని కూడా వదలని కామాంధుడు.. లైంగికదాడి చేశాడు.. తీవ్ర రక్తస్రావంతో..?

కామాంధులు పెచ్చరిల్లిపోతున్నారు. బాలికలు, మహిళలే కాదు చివరికి కుక్కలను కూడా లైంగికంగా వేధిస్తున్నారు. ఇలాంటి ఘటన దేశ రాజధాని నగరం ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలో ఓ కుక్కపిల్లను లైంగికంగా వేధించి.. దా

కామాంధులు పెచ్చరిల్లిపోతున్నారు. బాలికలు, మహిళలే కాదు చివరికి కుక్కలను కూడా లైంగికంగా వేధిస్తున్నారు. ఇలాంటి ఘటన దేశ రాజధాని నగరం ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలో ఓ కుక్కపిల్లను లైంగికంగా వేధించి.. దాన్ని చంపేసిన ఓ కామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో కారు డ్రైవర్‌గా పని చేస్తున్న నరేష్ కుమార్ (34).. ఓ ఆడ కుక్కపిల్లను ఇంట్లో పెంచుతున్నాడు. ఆ కుక్కపిల్లను కూడా వదిలిపెట్టని కామపిశాచి దానిపై లైంగిక దాడి చేశాడు. ఈ ఘటనలో కుక్కపిల్ల అధిక రక్తస్రావంతో చనిపోయింది. 
 
కుక్కపిల్ల చనిపోయాక బయటికి విసిరేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. ఆపై జరిపిన దర్యాప్తులో నరేష్ కుక్కపిల్లపై లైంగికంగా వేధించాడని పోస్టుమార్టంలో తేలింది. అంతేగాకుండా తన భార్య పట్ల కూడా నరేష్ కిరాతకంగా ప్రవర్తిస్తాడని, ఇద్దరు అమ్మాయిలకు తండ్రి అయిన నరేష్ కొన్ని రోజుల క్రితం ఆవేశానికి గురై తన భార్య చేతిని విరిచేశాడని పోలీసులు తెలిపారు.