బుధవారం, 3 డిశెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 8 ఆగస్టు 2025 (14:54 IST)

పెళ్లిలో పెళ్లి టైటిల్ చాలా ఆసక్తికరంగా వుంది : తనికెళ్ళ భరణి

Tanikella Bharani, Shiva Sai Rishi, Samsukthi Gore and others
Tanikella Bharani, Shiva Sai Rishi, Samsukthi Gore and others
గౌరి ఫిలింస్ తో కలిసి సుఖకర్త ఫిలింస్ పెళ్లిలో పెళ్లి చిత్రాన్ని నిర్మిస్తోంది. శివ సాయిరిషి, సంస్కృతి గోరే, విష్ణు ప్రియ, ఉమా మహేశ్వరరావు, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గణేష్ కోలి నిర్మాత. శ్రీకాంత్ సంబరం దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ తో పాటు బ్యానర్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు.
 
నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ, దర్శకుడు శ్రీకాంత్ కొద్దిరోజుల క్రితం ఈ సినిమా కోసం అప్రోచ్ అయ్యాడు. షోలాపూర్ లో సినిమా చేస్తున్నామని చెప్పాడు. అక్కడ తెలుగు వాళ్లు చాలా మంది ఉంటారు. నన్ను ఈ టీమ్ ఎంతో గౌరవంగా చూసుకున్నారు. పెద్దలను గౌరవించడం అనే గొప్ప గుణం వీళ్లందరిలో కనిపించింది. గణేష్ కోలి లాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ కు సక్సెస్ వస్తే మరిన్ని మంచి చిత్రాలు యంగ్ స్టర్స్ తో నిర్మిస్తారు అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా మాట్లాడుతూ, మంచి కథ కథనాలతో పాటు పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కుదిరాయి. కంప్లీట్ ఎంటర్ టైనింగ్ మూవీ ఇది అన్నారు.
 
ప్రొడ్యూసర్ గణేష్ కోలి మాట్లాడుతూ, ఈ సినిమా రూపకల్పన బాధ్యత మొత్తం మా దర్శకుడు శ్రీకాంత్ చూసుకున్నారు. ఈ కథలో ట్విస్ట్ ఏంటనేది ఇంకా నాకు కూడా రివీల్ చేయలేదు. నేనూ మీతో పాటే థియేటర్స్ లో చూడబోతున్నా అన్నారు.
 
డైరెక్టర్ శ్రీకాంత్ సంబరం మాట్లాడుతూ, భరణి గారు మా మూవీలో కీ రోల్ చేశారు. ఈ చిత్రం మా అందరికీ ఒక ఎమోషనల్ జర్నీ. ఆ ఎమోషన్ ప్రేక్షకులకు కూడా రీచ్ అవుతుందని నమ్ముతున్నాం. ఎంఎల్ రాజా గారు ఇచ్చిన మ్యూజిక్ మా మూవీకి సోల్ లాంటిది. మాలాంటి కొత్త వాళ్లకు సపోర్ట్ ఇచ్చి నిలబెట్టాల్సింది మీరే. అన్నారు.
 
హీరో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ, ఈ సినిమాలో కీ రోల్ చేసి ఈ టీమ్ కు సపోర్ట్ గా ఉన్న భరణి గారికి కూడా థ్యాంక్స్. "పెళ్లిలో పెళ్లి" సినిమా టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కలర్ పుల్ గా ఇంప్రెస్ చేస్తోంది. సినిమా కూడా మంచి కంటెంట్ తో ఆకట్టుకుంటుందనే నమ్ముతున్నా అన్నారు.