సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Updated : బుధవారం, 16 మే 2018 (13:01 IST)

హైదరాబాదుకు ఇంటర్య్వూకని వచ్చిన భీమవరం మహిళ అదృశ్యం

ఇంటర్య్వూకు వచ్చిన ఓ మహిళ అదృశ్యమైన ఘటన ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని రామచంద్రాపురానికి చెందిన నరేష్‌ వర్మ భార్య ఎం.శ్రావణి (24) ఈ నెల 1వతేదీన నగరంలో ఉద్య

ఇంటర్య్వూకు వచ్చిన ఓ మహిళ అదృశ్యమైన ఘటన ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని రామచంద్రాపురానికి చెందిన నరేష్‌ వర్మ భార్య ఎం.శ్రావణి (24) ఈ నెల 1వతేదీన నగరంలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వచ్చింది. ఇంటర్వ్యూ తర్వాత ఉప్పల్‌లో ఉండే స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. 
 
మరుసటిరోజు భీమవరం వెళ్లేందుకు శ్రావణిని ఆమె స్నేహితురాలు ఉప్పల్‌ రింగురోడ్డులో దింపేసి వెళ్లింది. ఆ తర్వాత శ్రావణి ఇంటికి చేరుకోలేదు. సెల్‌ఫోన్‌ సైతం స్విచ్ఛాప్‌ చేసి ఉంది. ఆచూకీ లభించకపోవడంతో శ్రావణి సోదరుడు సత్యనారాయణరాజు మంగళవారం ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.