గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : శనివారం, 12 మే 2018 (14:52 IST)

వేసవిలో కమిలిన చర్మాన్నికి ఈ చిట్కాలతో చెక్..

మీగడలో పసుపు కలిపి రోజూ చర్మానికి రాసుకున్న తరువాత నెమ్మదిగా మసాజ్ చేసినట్లైతే కమిలిన చర్మం యధాస్థితికి చేరుకునే అవకాశం ఉంది. గంధపు పొడిలో పసుపు, రోజ్‌వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని మీ ముఖం మెరుగుపడుతుంది.

స్త్రీ అందానికి ప్రతి రూపం. ఆ అందం నాజూకైన చర్మంతో మరింత ఇనుమడిస్తుంది. చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉండటమే కాకుండా శుభ్రంగాను ఉంచుకునేందుకు ప్రయత్నించాల్సి వుంటుంది. మహిళలు, తమ చర్మసౌందర్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచలేక పోతున్నామని తెగ ఆందోళన పడుతుంటారు. అలాంటి వారు కాసింత సమయం కేటాయించి కొన్ని చిట్కాలు పాటిస్తే.... 
 
 
మీగడలో పసుపు కలిపి రోజూ చర్మానికి రాసుకున్న తరువాత నెమ్మదిగా మసాజ్ చేసినట్లైతే కమిలిన చర్మం యధాస్థితికి చేరుకునే అవకాశం ఉంది. గంధపు పొడిలో పసుపు, రోజ్‌వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని మీ ముఖం మెరుగుపడుతుంది. ఎండకు నల్లగా మారిన మీ చర్మం కాంతివంతంగా మారుతుంది. 
 
బాదం పాలు ముఖానికి పట్టించి రాత్రంతా ఉంచుకోవాలి ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ఫ్రెష్‌గా తయారవుతుంది. నానబెట్టిన బాదం పప్పుల్ని పచ్చిపాలలో కలిపి పేస్టులా తయారు చేసుకుని మీ ముఖానికి ప్రతిరోజు ఒక గంటసేపు ఆ మిశ్రమాన్ని రాసుకుని, ఉదయాన్నే చల్లటి నీటితో శుభ్రం చేసుకున్నట్లైతే మంచి ఫలితాలు లభిస్తాయి.
 
ఒక బక్కెట్ నిండా నీళ్లకు తీసుకుని అందులో రెండు నిమ్మకాయల రసాన్ని పిండాలి. ఆ నీటిని బాగా కలిపి స్నానం చేయాలి. ఇలా కొన్ని నెలలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నిమ్మ, తులసి ఆకుల రసాలని పాళ్ళలో కలిపి రోజూ రెండుసార్లు ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖం కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.