శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By Kowsalya
Last Updated : శనివారం, 12 మే 2018 (14:27 IST)

డైటింగ్ పేరుతో పూర్తిగా భోజనం తగ్గించేస్తున్నారా..?

డైటింగ్ పేరుతో మహిళలు పూర్తిగా భోజనం తగ్గించేసి అతి తక్కువ కాలంలో బరువు తగ్గాలనుకుంటుంన్నారు. ఇలా చేయడం వల్ల జీవక్రియలు దెబ్బతింటాయి. చర్మం మెరుపును కోల్పోతారు. వార్ధక్య ఛాయలు కనిపిస్తాయి. అందుకే డైటింగ్ చేస్తున్న వాళ్లకి ఆహారంలో క్యాల్షియం, ఇనుము, వ

డైటింగ్ పేరుతో మహిళలు పూర్తిగా భోజనం తగ్గించేసి అతి తక్కువ కాలంలో బరువు తగ్గాలనుకుంటుంన్నారు. ఇలా చేయడం వల్ల జీవక్రియలు దెబ్బతింటాయి. చర్మం మెరుపును కోల్పోతారు. వార్ధక్య ఛాయలు కనిపిస్తాయి. అందుకే డైటింగ్ చేస్తున్న వాళ్లకి ఆహారంలో క్యాల్షియం, ఇనుము, విటమిన్-ఎ, ఇ, సి, బి కాంప్లెక్స్‌లు వంటివి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే బరువు తగ్గగలుగుతారు. 
 
సమతులాహారం, వ్యాయామం, జీవనవిధానం వీటన్నింటిని పాటిస్తే మంచిది. కొవ్వును తీసివేసి పాలు సేవించాలి. ఎముకలు బలంగా ఉండటానికి మాంసకృత్తులు, క్యాల్షియం అధికంగా ఉండే పాల ఉత్పత్తులను ఆహారంలో చేర్చుకుంటే మంచిది.

ఈ మాంసకృతుల కోసం కోడిగుడ్డులోని తెల్ల సొన, స్కిన్‌లెస్ చికెన్, వేరుశనగలు వీటిని తీసుకుంటే బరువు తగ్గాడానికి ఉపయోగపడుతుంది. జొన్నలు, తెల్ల ఓట్స్, రాగిమాల్ట్ ఇలాంటి పదార్థాలను తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.