శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 10 మే 2018 (18:29 IST)

బ్రొకోలితో కొలెస్ట్రాల్ తగ్గుతుందా?

బ్రొకోలీని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా గుండె ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. బ్రొకోలీ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బ్రొకోలిలో విటమిన్ బి5, సి, ఇ లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, శక్తివంతమైన న్యూట్రీషియ

బ్రొకోలితో కొలెస్ట్రాల్ తగ్గుతుందా?
Broccoli Health Benefits
Broccoli, Health, Tips, Heart, Cancer, Vitamins, Antioxidants, Calcium, బ్రొకోలి, ఆరోగ్యం, గుండె, కొలెస్ట్రాల్, క్యాన్సర్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ 
 
బ్రొకోలీని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా గుండె ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. బ్రొకోలీ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బ్రొకోలిలో విటమిన్ బి5, సి, ఇ లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, శక్తివంతమైన న్యూట్రీషియన్స్‌ను కలిగి వుంటుంది. బ్రొకోలీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియలను మెరుగుపరుస్తుంది. బ్రొకోలి అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్‌ను పుష్కలంగా కలిగి ఉంది. 
 
ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్, కెరొటనాయిడ్స్, టూటిన్, బీటా కెరోటిన్ వంటి పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా శరీరంలో ఏర్పడే టాక్సిన్లను తొలగిస్తుంది. క్యాన్సర్ కారకాలతో పోరాడే అత్యుత్తమ ఆహార పదార్థాల్లో బ్రోకోలి ఒకటి. ఇది శరీరానికి అవసరమయ్యే ఎంజైములకు రక్షణ కల్పిస్తుంది. అలాగే క్యాన్సర్‌కు కారణం అయ్యే కెమికల్స్‌ను తొలగిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.