ఆదివారం, 3 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By kowsalya
Last Updated : బుధవారం, 9 మే 2018 (10:36 IST)

కంటిని కాపాడే చిట్కాలు.. దృష్టి లోపాలను దూరం చేసే బాదం పప్పులు

కళ్లతోనే ఈ సృష్టిని మనం చూస్తున్నాం. చెవులతో వినలేని.. మాటలతో చెప్పలేని ఎన్నో భావాలను కళ్ల ద్వారా తెలుపుతున్నాం. అలాంటి కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ ప్రస్తుతం చాలామంది అనేక కంటి సమస్యలతో సతమత

కళ్లతోనే  ఈ సృష్టిని మనం చూస్తున్నాం. చెవులతో వినలేని.. మాటలతో చెప్పలేని ఎన్నో భావాలను కళ్ల ద్వారా తెలుపుతున్నాం. అలాంటి కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ ప్రస్తుతం చాలామంది అనేక కంటి సమస్యలతో సతమతమవుతున్నారు. చిన్న వయస్సులోనే దృష్టి లోపాలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి కంటి సమస్యలను తొలగించుకునేందుకు ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. 
 
100 గ్రాముల బాదం పప్పు, 100 గ్రాముల సోంపు, 100 గ్రాముల పంచదార.. ఈ మూడింటిని కలిపి మెత్తని పౌడర్‌లా చేయాలి. ఈ పొడిని రెండు స్పూన్ల మోతాదులో ఒక గ్లాస్ వేడి పాలలో కలిపి ప్రతి రోజు రాత్రి పూట నిద్రించే ముందు తాగాలి. దీంతో దృష్టి సంబంధ సమస్యలు పోతాయి. కంటి చూపు మెరుగు పడుతుంది. 8 నుంచి 10 బాదం పప్పులను తీసుకుని రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. ఉదయం ఆ బాదం పప్పు పొట్టును తీసివేయాలి. అనంతరం వాటిని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ పేస్ట్‌ను ఒక స్పూన్ మోతాదులో తీసుకుని వేడి పాలలో కలిపి ఉదయాన్నే తాగాలి. ఒకటి రెండు నెలల పాటు ఇలా తాగితే చూపు బాగా కనిపిస్తుంది. 
 
ఆరు నుంచి ఎనిమిది పచ్చి ఉసిరి కాయలను తీసుకుని బాగా కడిగీ వాటిలోంచి విత్తనాలను వేరు చేసి ఆ కాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.  ఆ ముక్కలను మిక్సీలో వేసి మిశ్రమంగా చేశాక దాన్నుంచి జ్యూస్‌ను తేనేతో కలిపి నిత్యం ఉదయాన్నే తాగాలి. దీని వల్ల కంటి సమస్యలు పోయి దృష్టి బాగా కనిపిస్తుంది. 
 
అర‌కిలో వాల్‌న‌ట్స్‌, 300 గ్రాముల తేనె, 100 గ్రాముల క‌ల‌బంద గుజ్జు లేదా జ్యూస్‌, 4 నిమ్మ‌కాయ‌ల‌ను తీసుకోవాలి. నిమ్మ‌కాయ‌ల‌ను పిండి వాటి నుంచి ర‌సం తీసి దాన్ని మిగిలిన ప‌దార్థాల‌కు బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని రోజుకు 3 సార్లు తీసుకోవాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, మ‌ధ్యాహ్నం లంచ్‌, రాత్రి డిన్న‌ర్‌కు ముందు ఈ మిశ్ర‌మాన్ని తీసుకుంటే క్ర‌మంగా కంటి చూపు మెరుగ‌వుతుంది. ఆరు నెల‌ల గ‌ర్భం దాటిన మ‌హిళ‌లు, కిడ్నీలు, గ్యాస్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు దీన్ని తీసుకోకూడ‌దని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే విట‌మిన్ ఎ ఎక్కువ‌గా ఉండే యాపిల్‌, క్యారెట్‌, పాల‌కూర వంటి ఆహారాన్ని నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకుంటుంటే కంటి చూపు మెరుగు ప‌డుతుంది. ఉద‌యాన్నే నిద్ర‌లేవ‌గానే చ‌ల్ల‌ని నీటితో క‌ళ్ల‌ను క‌డుక్కోవాలి. క‌ళ్లు బాగా ఒత్తిడికి గురై మంట‌లుగా ఉన్న‌ప్పుడు కూడా చ‌ల్ల‌ని నీటితో క‌డుక్కోవ‌చ్చు.

లేదంటే రెండు అర‌చేతులను బాగా రుద్ది క‌ళ్ల‌పై పెట్టుకోవాలి. దీని వ‌ల్ల వేడి క‌ళ్ల‌కు తాకి కంటి న‌రాలు రిలాక్స్ అవుతాయి. ఒక కొవ్వొత్తిని వెలిగించి దాన్నే త‌దేకంగా చూస్తూ నెమ్మ‌దిగా క‌ళ్లు మూసుకోవాలి. మ‌ళ్లీ నెమ్మ‌దిగా క‌ళ్లు తెర‌వాలి. ఇలా క‌నీసం ఐదు సార్లు చేయాలి. దీంతో స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వుతుంది.