ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 4 మే 2018 (18:31 IST)

చెక్కిళ్లు పెరిగేందుకు అనుసరించాల్సిన చిట్కాలు...

మనం అందంగా కనిపించాలంటే మన ముఖం అందంగా, ఆకర్షణీయంగా ఉండాలి. మన ముఖానికి అందాన్ని ఇచ్చేవి మన బుగ్గలు. మనం తీసుకునే ఆహారం, మన దైనందిన జీవితం, మనం చేసే వ్యాయామాల మీద మన ముఖసౌందర్యం ఆధారపడి ఉంటుంది. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మన అందాన్ని మరింత

మనం అందంగా కనిపించాలంటే మన ముఖం అందంగా, ఆకర్షణీయంగా ఉండాలి. మన ముఖానికి అందాన్ని ఇచ్చేవి మన బుగ్గలు. మనం తీసుకునే ఆహారం, మన దైనందిన జీవితం, మనం చేసే వ్యాయామాల మీద మన ముఖసౌందర్యం ఆధారపడి ఉంటుంది. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మన అందాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చు. అదెలాగో చూద్దాం. 
 
1. బుగ్గల నిండా గాలిని నింపి 30 నుండి 60 సెకన్ల సేపు అలాగే ఉంచి నెమ్మదిగా గాలిని వదలాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయడం వల్ల బుగ్గలు మరింత బుగ్గలు సహజసిద్ధమైన అందంతో మెరుస్తూ ఉంటాయి.
 
2. రెండు స్పూన్ల రోజ్ వాటర్‌లో ఒక స్పూన్ గ్లిజరిన్‌ను కలిపి బుగ్గలకు రాయాలి. దీనిలో ఉన్న గ్లిజరిన్ చర్మంపై ఉన్నముడతలను తగ్గించి చర్మం బిగుతుగా అయ్యేలా చేస్తుంది. ఇది బుగ్గలకు సహజసిద్ధమైన పోషణను ఇస్తుంది. 
 
3. రోజూ ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకొని బుగ్గలకు మర్దన చేస్తే మంచి అందమైన బుగ్గలు మీ సొంతం అవుతాయి.
 
4. రోజూ స్నానానికి 15 నిమిషాల ముందు రెండు స్పూన్ల వెన్నలో ఒక స్పూన్ పంచదారను కలిపి ముఖానికి బాగా మర్దన చేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా ప్రతిరోజు క్రమంతప్పకుండా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
 
5. ప్రతిరోజు రెండు పూటలా రెండు గ్లాసుల పాలు త్రాగటం వలన మంచి ఫలితం ఉంటుంది.
 
6. రోజుకు 5 లేక 6 సార్లు బూరను ఊదటం వలన బుగ్గలకు మంచి వ్యాయామం జరుగుతుంది.
 
7. ఒక యాపిల్‌ను ముక్కలుగా కోసి మెత్తగా పేస్టులా చేయాలి. దీనిని బుగ్గలకు పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. యాపిల్‌లో ఉన్న కొల్లేజిన్ అనే ప్రోటీన్ చర్మం సాగే గుణాన్ని తగ్గించి సహజసిద్ధమైన అందాన్ని ఇస్తుంది.