శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 28 జనవరి 2018 (13:57 IST)

పొటాటో, క్యారెట్ కట్ చేస్తే ఒత్తిడి మాయం: ఉపాసన వార్నింగ్

పొటాటో, క్యారెట్ కట్ చేస్తే ఒత్తిడి దూరమవుతుందని ట్విట్టర్ ద్వారా వీడియో సందేశాన్ని ఉపాసన వెల్లడించారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఉపాసన.. వారాంతంలో రిలాక్స్ కావాలంటే, మానసిక ఒత్తిడిని దూ

పొటాటో, క్యారెట్ కట్ చేస్తే ఒత్తిడి దూరమవుతుందని ట్విట్టర్ ద్వారా వీడియో సందేశాన్ని ఉపాసన వెల్లడించారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఉపాసన.. వారాంతంలో రిలాక్స్ కావాలంటే, మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. ఇంట్లో కూరగాయలను కట్ చేయండి అంటూ సలహా ఇచ్చారు. ఇలా చేస్తే ఒత్తిడి జయించడంతో పాటు ఏకాగ్రతను పెంపొందించుకోవచ్చునని సలహా ఇచ్చారు. 
 
ఒత్తిడితో కూడుకున్న సమావేశాలు, పరీక్షలకు ముందు ఇది ఎంతో ఉపయోగకరంగా వుంటుందని ఉపాసన పేర్కొన్నారు. ఇలాంటి పనులతో జీవితాన్ని ప్రేమతో ఆస్వాదించవచ్చునని సూచించారు. ఇదిలా ఉంటే.. చెర్రీ హీరోగా నటిస్తున్న ''రంగస్థలం'' సినిమా టీజర్ విడుదలైన సందర్భంగా ఇంటి ముందు మెగా ఫ్యాన్స్ కోలాహలాన్ని ఉపాసన సోషల్ మీడియాలో పోస్టు చేసిన సంగతి తెలిసిందే.