శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : గురువారం, 30 నవంబరు 2017 (11:07 IST)

భోజనం చేసిన వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా?

చాలా మందికి ఐస్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది. అనేక మంది భోజనం చేసిన వెంటనే చల్లని నీరు తాగుతుంటారు. ఇలా ఐస్ వాటర్ తాగడం ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

చాలా మందికి ఐస్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది. అనేక మంది భోజనం చేసిన వెంటనే చల్లని నీరు తాగుతుంటారు. ఇలా ఐస్ వాటర్ తాగడం ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు వైద్యులు. 
 
ఒకవేళ ఖచ్చితంగా ఐస్ వాటర్ తాగాలని అనుకుంటే మాత్రం భోజనం చేశాక 20-30 నిమిషాల తర్వాత తాగడం మంచిదట. భోజనం చేసిన వెంటనే చల్లటినీరు తాగితే గుండెపోటు, కేన్సర్ వంటి వ్యాధులు దరిచేరే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే, కోవ్వు ప్రేగుల్లో పేరుకుని పోతుందట. 
 
అదేసమయంలో భోజనం చేశాక గోరు వెచ్చటి నీరు తాగితే గుండెతో పాటు శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుందట. పైగా, గోరు వెచ్చని నీరు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ చేరకుండా చేస్తుందట.