గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 24 నవంబరు 2017 (16:43 IST)

ఆర్కేనగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అన్నాడీఎంకే అభ్యర్థి ఎవరు?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. ఇది వరకే ఆర్కే నగర్ ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైనా... డబ్బులు పంపిణీ, నిబంధల ఉల్లంఘన

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. ఇది వరకే ఆర్కే నగర్ ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైనా... డబ్బులు పంపిణీ, నిబంధల ఉల్లంఘనల వల్ల ఆ ఎన్నికలు రద్దయ్యాయి. అయితే ప్రస్తుతం అన్నాడీఎంకేలో ఓపీఎస్-ఈపీఎస్ వర్గాలు ఏకమైన వేళ.. గురువారం ఎలక్షన్ కమిషన్ రెండాకుల చిహ్నాన్ని వారికే కేటాయించింది. దీంతో శశికళ వర్గానికి చెక్ పెట్టినట్లైంది. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం ఆర్కేనగర్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి డిసెంబర్ 21న పోలింగ్ నిర్వహించి, 24న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ప్రకటించింది. గతంలో ఏప్రిల్ 12న ఆర్కే నగర్ ఉప ఎన్నిక జరుగాల్సి ఉండగా.. అధికార ఏఐఏడీంకే పార్టీ నేతలు ఓటర్లకు లంచం ఇచ్చి ప్రలోభపెడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వాయిదా పడింది. ఆ తర్వాత మద్రాస్ హైకోర్టు డిసెంబర్ 31లోపు ఆర్కేనగర్ ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తేదీలను ప్రకటించింది. 
 
ఇక సోమవారం నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు డిసెంబర్ 4 చివరి తేది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ డిసెంబర్ 7గా నిర్ణయించినట్లు ఎన్నికల సంఘం శుక్రవారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే, డీఎంకే తరపున బరిలోకి దిగే అభ్యర్థులు ఎవరైవుంటారా? అని ప్రజల్లో ఆసక్తి మొదలైంది.