శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 24 నవంబరు 2017 (21:24 IST)

బాంబు పేల్చి చంపారు, తప్పించుకుని పారిపోతుంటే కాల్చారు... 235 మందిని...

ఈజిప్టులోని ఉత్తర సినాయ్ ప్రావిన్సులో ప్రార్థనలతో రద్దీగా వున్న ఓ మసీదుపై ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. శుక్రవారం ప్రార్థనలు చేస్తున్న సమయంలో బాంబు దాడులతో మసీదుపై విరుచుకపడ్డారు. ఈ దాడిలో అక్కడికక్కడే 180 మంది మరణించారు.

బాంబు దాడి నుంచి తప్పించుకుని పారిపోతున్న మరికొందరిపై ఉగ్రవాదులు తుపాకులతో వెంటాడి వెంటాడి చంపారు. ఈ తుపాకుల దాడిలో మరో 55 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. కాగా తీవ్రంగా గాయపడినవారు 100 మందికి పైగా వున్నట్లు చెపుతున్నారు. ఈ దాడికి పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులగా భావిస్తున్నారు.