శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2017 (10:57 IST)

అతిగా తినకండి.. అనారోగ్య సమస్యలు తప్పవ్

పదే పదే అనారోగ్యాల బారిన పడుతున్నారా? జలుబు, దగ్గు, జ్వరంతో ఇబ్బందులు తప్పట్లేదా? అయితే ఈ చిట్కాలు పాటించండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు. వ్యాధుల బారిన పడేకంటే వాటిని ముందుగానే

పదే పదే అనారోగ్యాల బారిన పడుతున్నారా? జలుబు, దగ్గు, జ్వరంతో ఇబ్బందులు తప్పట్లేదా? అయితే ఈ చిట్కాలు పాటించండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు. వ్యాధుల బారిన పడేకంటే వాటిని ముందుగానే నివారించుకోవడం ఉత్తమం. ఇందుకు చేయాల్సినవి.. ముందుగా బరువును తగ్గించుకోవాలి. 
 
ఒత్తిడిని పక్కన బెట్టాలి. సరైన సమయానికి భోజనం చేయాలి. రోజుకు 8 గంటలు నిద్రపోవాలి. ఓ పద్ధతి ప్రకారం పోషకాహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తుండాలి. అతిగా తినకూడదు. సమతుల ఆహారం తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో ధాన్యపు గింజలు, కూరగాయలు, పప్పు దినుసులు, పండ్లు, పాల ఉత్పత్తులు వుండేలా చూసుకోవాలి. 
 
బరువు తగ్గాలనుకునేవారు, డయాబెటిస్‌ను దూరం చేసుకోవాలనుకునే వారు పండ్లు, కూరగాయలను తీసుకోవడం మరిచిపోకూడదు. మానసిక ఒత్తిడిని దరిచేరనివ్వకుండా మార్పు కోసం వారానికోసారి ప్రకృతిని ఆస్వాదించే ప్రాంతాలకు వెళ్లడం చేయాలి.

యాంత్రిక జీవితం తప్పనిసరి కావడంతో సరైన సమయానికి పనులను పూర్తి చేసుకోవడానికి అలవాటు పడాలి. సమతుల ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, మానసిక ఒత్తిడికి దూరంగా వుండటం ద్వారా అనారోగ్య సమస్యలను తొలగించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.