ఉప్పు కలిపిన పల్లీలు తింటున్నారా?
నట్స్ తరహాలో పల్లీలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పల్లీలు శరీరంలో ఆరోగ్యకరమైన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నిద్రలేమి సమస్యను దూరం చేస్తాయి. వేరుశెనగల్లో వుండే ఫైబర్, ప్రోటీన్లు బరువును తగ్గిస్
నట్స్ తరహాలో పల్లీలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పల్లీలు శరీరంలో ఆరోగ్యకరమైన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నిద్రలేమి సమస్యను దూరం చేస్తాయి. వేరుశెనగల్లో వుండే ఫైబర్, ప్రోటీన్లు బరువును తగ్గిస్తాయి. ప్రోటీన్‌లు ఎక్కువ సమయం పొట్ట నిండినట్టుగా అనిపించేలా చేస్తాయి. ఫలితంగా ఆహార పదార్థాలపై ఎక్కువ మొగ్గుచూపరు. తద్వారా అనవసరంగా బరువు పెరగరు.
అయితే బరువు తగ్గాలనుకునేవారు వేరుశెనగల వల్ల అలర్జీలు వస్తాయో లేదోనని పరిశీలించి తీసుకోవాలి. ఒకవేళ ఎలాంటి అలర్జీ చర్యలు లేకుండా ఉంటే రోజుకు 50 గ్రాముల వేరుశెనగలను తీసుకోవచ్చు. ఇలా రోజూ మోతాదుకు మించకుండా వేరుశెనగల్ని తీసుకోవడం ద్వారా హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే వేరుశెనగలను వేయించి లేదా ఉడికించి తీసుకోవడం ఉత్తమం. వేరుశనగ తినటం వలన రక్తంలోని చక్కెర స్థాయిలు క్రమబద్ధీకరించబడతాయి.
ఇక ఉప్పు కలిపిన వేరుశెనగలను తీసుకుంటే.. ఆరోగ్యానికి హానికరమేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు కలిపిన వేరు శెనగల్ని తినడం ద్వారా బరువు పెరగడం.. మధుమేహం వంటి రోగాలు తప్పవని వారు చెప్తున్నారు.
నట్స్ ఉపయోగాలు..
పల్లీలు, పిస్తాలు, బాదం, జీడిపప్పులు, వాల్ నట్స్ తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుందట. గుండె ఆరోగ్యంగా పనిచేసేందుకు నట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. నిత్యయవ్వనులుగా ఉండేలా చేస్తాయి. నట్స్ గుప్పెడు రోజూ తీసుకుంటే నిద్రలేమి సమస్య దూరమవుతుంది. రోజూ నట్స్ తీసుకుంటే పిల్లలకు ఎంతో మేలు జరుగుతుంది. వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. తద్వారా పిల్లలు చదవడం, నేర్చుకోవడం, గుర్తుపెట్టుకోవడం వంటివి సులభం అవుతాయి.