మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By pnr
Last Updated : ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (16:24 IST)

చికెన్ సూప్‌తో జలుబుకు చెక్!

మాంసాహారులు చికెన్ ముక్క అంటే ఇష్టపడని వారుండరు. అలాంటి చికెన్ ముక్కలతో తయారు చేసే సూప్‌తో ఎన్నో ఆరోగ్యకరమైన లాభాలు ఉన్నట్టు పరిశోధనాకారులు చెపుతున్నారు. ముఖ్యంగా, బాగా జలుబు చేసినప్పుడు వేడి వేడి చిక

మాంసాహారులు చికెన్ ముక్క అంటే ఇష్టపడని వారుండరు. అలాంటి చికెన్ ముక్కలతో తయారు చేసే సూప్‌తో ఎన్నో ఆరోగ్యకరమైన లాభాలు ఉన్నట్టు పరిశోధనాకారులు చెపుతున్నారు. ముఖ్యంగా, బాగా జలుబు చేసినప్పుడు వేడి వేడి చికెన్‌సూప్‌ను కాస్తంత తాగితే జలుబు  ఇట్టే తగ్గిపోతుందట.
 
అంతేకాదండోయ్.. చికెన్‌సూప్‌ జలుబును తగ్గించడమే కాదు... దాని సువాసనలో ఉండే యాంటీ–ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్స్‌ వల్ల చాలా ప్రయోజనాలు ఒనగూరుతాయని చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ నెబ్రాస్కాకు చెందిన పరిశోధకులు. అందుకే చికెన్ సూప్ సేవించడం అనేది కేవలం చిట్కా వైద్యం కాదనీ... దీనికి సశాస్త్రీయ ఆధారాలున్నాయని చెపుతున్నారు. 
 
చికెన్ సూప్‌లో ఇన్ఫెక్షన్స్‌‌తో పోరాడే గుణాలున్నట్లు తాను గుర్తించానని పరిశోధకుడు చెప్పాడు. అలాగే, చికెన్‌ సువాసన (అరోమా)తో సైనసైటిస్‌ తగ్గుతుందనీ, శ్వాసకోశవ్యవస్థ పైభాగంలో ఏదో అడ్డుకున్నట్లుగా ఉండి గాలి ఆడనట్లుగా ఉండే ఫీలింగ్‌ కూడా తగ్గుతుందని తెలిపారు.