ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 14 నవంబరు 2017 (10:27 IST)

'బాహుబలి' స్టంట్‌కి కేరళ యూత్ యత్నం.. క్షణాల్లో గాల్లో... (వీడియో)

'బాహుబలి 2' చిత్రంలో ప్రభాస్ ఏనుగు తొండంపై కాలు పెట్టి పైకి ఎక్కే సీన్‌ ఉంది. అచ్చం ఇదే తరహాలో కేరళకు చెందిన ఓ యువకుడే చేసేందుకు ప్రయత్నించాడు. అంతే, కొన్ని క్షణాల్లో గాల్లో ఎగిరిపడ్డాడు. దీనికి సంబంధ

'బాహుబలి 2' చిత్రంలో ప్రభాస్ ఏనుగు తొండంపై కాలు పెట్టి పైకి ఎక్కే సీన్‌ ఉంది. అచ్చం ఇదే తరహాలో కేరళకు చెందిన ఓ యువకుడే చేసేందుకు ప్రయత్నించాడు. అంతే, కొన్ని క్షణాల్లో గాల్లో ఎగిరిపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కేరళలో ఇడుక్కి జిల్లాలలోని థోడుపూళా అనే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు బాహుబలి స్టంట్ చేయాలని భావించాడు. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ఏనుగుకు అరటిపండు అందించాడు. ఆ తర్వాత ఏనుగు తలపై ముద్దు పెట్టాడు. అంతటితో ఆగకుండా మెల్లగా ఏనుగు దంతాలు పట్టుకుని పైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. 
 
ఇంకేముంది ఏనుగుకు తిక్కలేవడంతో ఒక్కసారిగా అతన్ని తొండంతో విసిరికొట్టింది. దీంతో ఆ యువకుడు గాల్లోకి ఎగిరి పడ్డాడు. ఈ ఘటనంతా వీడియో తీస్తున్న యువకుడి స్నేహితుడు అతన్ని ఏనుగు బారి నుంచి రక్షించి ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చిక్సితనందిస్తున్నారు.