ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2017 (17:29 IST)

'బాహుబలి' తండ్రి ఐమాక్స్ ప్రసాద్‌కు అందుకే ఛాన్సులొస్తున్నాయట

బాహుబలి చిత్రంలో చిన్ని పాత్ర వేసినవారిని కూడా జనం మర్చిపోలేరు. ఎందుకంటే ఆ సినిమా అలాంటిదిమరి. బాహుబలి చిత్రంలో మహేంద్ర బాహుబలి... శివుడు పాత్రకు తండ్రిగా నటించిన ఐమాక్స్ ప్రసాద్ మామూలోడు కాదట. ఆయనకు

బాహుబలి చిత్రంలో చిన్ని పాత్ర వేసినవారిని కూడా జనం మర్చిపోలేరు. ఎందుకంటే ఆ సినిమా అలాంటిదిమరి. బాహుబలి చిత్రంలో మహేంద్ర బాహుబలి... శివుడు పాత్రకు తండ్రిగా నటించిన ఐమాక్స్ ప్రసాద్ మామూలోడు కాదట. ఆయనకు పలుకుబడి చాలా ఎక్కువట. కాగా ఓ మహిళను మోసం చేసిన కేసులో ఆయన ఇరుక్కున్నాడు. 
 
ఐతే ప్రసాద్ తన పరిచయాలతో ఆ కేసు నుంచి త్వరగానే బయటకు వచ్చేస్తాడని ఫిలిమ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ఐమాక్స్ థియేటర్స్ మేనేజర్ కావడంతో చాలామంది సినీ పెద్దలతో ఆయన టచ్‌లో వుంటుంటారట. సినీ పెద్దలు కూడా ఆయనంటే ఓ సాఫ్ట్ కార్నర్ వున్నదట. ఎందుకంటే... తమ సినిమాలు విడుదలయిప్పుడు వారివారి చిత్రాలు మరిన్ని రోజులు ప్రదర్శించేందుకు ఈయన సాయపడుతుంటాడని సమాచారం. ఈ కారణంగానే ఆయనకు సినిమా అవకాశాలు వస్తున్నాయని కూడా చెప్పుకుంటున్నారు.