మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : శుక్రవారం, 4 మే 2018 (11:43 IST)

శనివారం హనుమంతుడి పూజిస్తే.. నువ్వులు, పంచదారను..?

మానసిక ప్రశాంతత లోపించిందా? కార్యానుకూలత చేకూరట్లేదా? ఐతే మంగళ, శనివారాల్లో హనుమంతుడి పూజ చేయాల్సిందేనని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. హనుమంతుడి అనుగ్రహంతో ధైర్యం చేకూరుతుంది. లక్ష్యాన్ని సునాయా

మానసిక ప్రశాంతత లోపించిందా? కార్యానుకూలత చేకూరట్లేదా? ఐతే మంగళ, శనివారాల్లో హనుమంతుడి పూజ చేయాల్సిందేనని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. హనుమంతుడి అనుగ్రహంతో ధైర్యం చేకూరుతుంది. లక్ష్యాన్ని సునాయాసంగా చేధించగలరని వారు సూచిస్తున్నారు.


బ్రహ్మచారి, శ్రీరామ భక్తుడు, చిరంజీవి అయిన హనుమాన్ శివాంశంతో అంజనీపుత్రుడిగా జన్మించాడు. రామ భజన ఎక్కడ జరుగుతుందో అక్కడ హనుమంతుడు తప్పక వుంటాడని విశ్వాసం. హిమాలయాల్లో హనుమంతుడు కొలువై వుంటాడని భక్తుల నమ్మకం. శనివారాల్లో హనుమంతుడిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయి. ధైర్యం చేకూరుతుంది. 
 
ఇంకా నవగ్రహాలను లంకలో రావణుడు బంధించిన వేళ.. శనీశ్వరుడిని రావణుని చెర నుంచి హనుమంతుడు విముక్తిడిని చేశాడు. ఆ సందర్భంగా శనీశ్వరుడు హనుమాన్‌కు ఓ వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ వర ప్రభావంతో శనీశ్వర దోషాలున్నవారు హనుమంతుడిని పూజిస్తే అవి నివృత్తి అవుతాయి. 
 
హనుమంతుడిని శనివారం ఎలా పూజించాలంటే.. 
ప్రతి మంగళవారం, శనివారం హనుమంతుడిని ఆలయాన్ని దర్శించుకోవాలి. హనుమాన్‌ చాలిసాను రోజూ ఉదయం, నిద్రించేందుకు ముందు పఠించాలి. మంగళ, శనివారాల్లో మాంసాహారాన్ని తీసుకోకూడదు. రోజుకు ఓసారైనా హనుమాన్ చాలిసాను చదవాలి. శనివారం సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించాలి. స్నానమాచరించేటప్పుడు అరస్పూన్ నువ్వులు తలపై వుంచి స్నానం చేయాలి. తర్వాత హనుమాన్ ఆలయానికి వెళ్లి ఓ స్పూన్ నువ్వులు, పంచదార, ఎరుపు రంగు ధాన్యాలను వదిలి పెట్టి రావాలి.
 
ఇలా 11 వారాల పాటు చేస్తే.. ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలుండవు. శనివారం పూట నువ్వుల దీపం వెలిగించడం మరిచిపోకూడదు. మానసిక ఒత్తిడి దూరం కావాలంటే హనుమాన్ చాలీసాను చదవండి లేదా వినండి. హనుమాన్‌ను పూజించే వారిలో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. అనారోగ్య సమస్యలను దూరం చేసుకుంటారు. విద్యలో రాణించాలంటే.. ఉద్యోగవకాశాలు లభించాలంటే.. హనుమంతుడిని పూజించాల్సిందేనని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.