మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : బుధవారం, 18 ఏప్రియల్ 2018 (12:48 IST)

నవగ్రహ దోషాలు తొలగిపోవాలంటే.. రోజూ సింధూరాన్ని..?

ఆంజనేయ స్వామి దివ్యప్రసాదమైన సింధూరాన్ని నవగ్రహ దోషాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారు నుదుట ధరిస్తే.. గ్రహ దోషాలుండవు. ఈతిబాధలు తొలగిపోతాయి. ఏలినాటి శనిదోషాలుండవు. అలాగే ఇంట ఆంజనేయ స్వామి చిత్ర పటాన్ని దక్

ఆంజనేయ స్వామి దివ్యప్రసాదమైన సింధూరాన్ని నవగ్రహ దోషాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారు నుదుట ధరిస్తే.. గ్రహ దోషాలుండవు. ఈతిబాధలు తొలగిపోతాయి. ఏలినాటి శనిదోషాలుండవు. అలాగే ఇంట ఆంజనేయ స్వామి చిత్ర పటాన్ని దక్షిణం వైపు వుంచి కొద్దిగా గంధాన్ని స్వామి కిరీటానికి పెట్టాలి. తర్వాత గంధాన్ని పూస్తూ.. చివరిగా ఆంజనేయ పాదం వద్ద పెట్టి పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 
 
ఇక గృహంలోని కుటుంబ సభ్యులకు నిత్యం కలహాలు ఏర్పడితే.. ఆంజనేయ స్వామి సింధూరాన్ని నుదుట ధరించాలి. ఇలా చేస్తే ఇంట ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. వివాహమైన కొత్త దంపతులు ఆంజనేయస్వామి సింధూరాన్ని ధరిస్తే వారికి సంతాన ప్రాప్తి చేకూరుతుంది. లోబీపీతో బాధపడేవారు ఆంజనేయ స్వామి తీర్థాన్ని సేవించడం, సింధూరాన్ని ధరించడం ద్వారా అనారోగ్య సమస్యలుండవు. 
 
విద్యార్థులు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి అంగారాన్ని పెట్టుకుంటే పరీక్ష సమయంలో చదివిన విషయాలన్నింటినీ మరిచిపోకుండా ఉంటారు. పిల్లలకు సింధూరాన్ని పెడితే భయం, భీతి, రోగ బాధలుండవు. భార్యభర్తలు, పిల్లల మధ్య సఖ్యత ఉండకపోతే సింధూరాన్ని నుదట ధరించాలని.. ఇలా చేస్తే సంతోషం, మానసిక ప్రశాంతత చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.