గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 21 జనవరి 2018 (10:39 IST)

పవన్ ట్వీట్ : కొండగట్టు ఆంజనేయ స్వామి సాక్షిగా యాత్ర

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంభించనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.

కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంభించనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తన రాజకీయ పర్యటన ప్రణాళికను అక్కడే ప్రకటిస్తానని శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. తమ కుటుంబానికి కొండగట్టు ఆంజనేయస్వామి ఇలవేల్పుగా చెప్పారు. అందుకే కొండగట్టు నుంచి తన నిరంతర రాజకీయ యాత్రను ప్రారంభించడానికి కారణమన్నారు. 
 
2009లో ఎన్నికల ప్రచార సమయంలో పెను ప్రమాదం నుంచి తాను ఇక్కడే క్షేమంగా బయటపడ్డానని గుర్తు చేసుకున్నారు. సర్వమత ప్రార్థనల అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సుల కోసం, సమస్యల అధ్యయనం, అవగాహన కోసం ఈ యాత్రతో వస్తున్నట్లు తెలిపారు. తనను తెలుగు ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. అయితే కొండగట్టుకు ఎప్పుడు వెళ్లేది పవన్ ప్రకటించలేదు.