గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By tj
Last Updated : బుధవారం, 17 జనవరి 2018 (16:44 IST)

సొంత ఊరిలో కత్తి మహేష్‌ను చితకబాదిన పవన్ ఫ్యాన్స్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌‌పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత డిబేట్‌లలో పవన్ ఫ్యాన్స్ నుంచి ఇబ్బందులు పడి చివరకు కొన్నిరోజుల పాటు సైలెంట్‌గా ఉండిపోయారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌‌పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత డిబేట్‌లలో పవన్ ఫ్యాన్స్ నుంచి ఇబ్బందులు పడి చివరకు కొన్నిరోజుల పాటు సైలెంట్‌గా ఉండిపోయారు. తాను వేసిన ప్రశ్నలకు జనవరి 15వ తేదీలోగా పవన్ కళ్యాణ్‌ సమాధానం చెప్పాలని అంతవరకు నేనేమీ మాట్లాడనని ప్రకటించాడు కూడా. దీంతో పవన్ కళ్యాణ్‌ అభిమానులు కూడా సైలెంట్ అయిపోయారు. ఇదంతా జరుగుతుండగానే పండుగ జరుపుకునేందుకు తన స్వగ్రామంకు కత్తి మహేష్ వెళ్లారు. 
 
కత్తి మహేష్ సొంత జిల్లా చిత్తూరు. స్వగ్రామం పీలేరు సమీపంలోని యలమంద. మూడురోజుల పాటు యలమందలోని గ్రామస్తులతోనే, తన స్వగ్రామంలోనే ఆయన ఉన్నారు. అయితే 13వ తేదీ పవన్ మహేష్ కత్తి చిత్తూరు జిల్లాకు వచ్చినప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్ రెక్కీ నిర్వహించారు. ఆ తర్వాత 14వ తేదీ కత్తి మహేష్‌పై దాడి చేసి చితకబాదారు. పదిమందికిపైగా పవన్ ఫ్యాన్స్ మహేష్ పై దాడి చేసి చితకబాదినట్లు తెలుస్తోంది. 
 
అయితే పవన్ ఫ్యాన్ తనపై దాడి చేస్తుండగా మహేష్ కత్తి గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అక్కడకు పరుగులు తీశారు. ఇంతలో పవన్ ఫ్యాన్స్ అక్కడి నుంచి జారుకున్నట్లు సమాచారం. మహేష్ కత్తి మాత్రం తనపై జరిగిన దాడిని పోలీసులకు ఫిర్యాదు చేయకుండా సైలెంట్ అయిపోయారట. ఇక్కడ జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పొద్దంటూ గ్రామస్తులను కూడా మహేష్ కత్తి ప్రాధేయపడి హైదరాబాద్‌కు వచ్చేశారట.