శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi

'అజ్ఞాతవాసి' ఫట్... పవన్ రెమ్యూనరేషన్ తిరిగిచ్చేశాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం అజ్ఞాతవాసి. ఈచిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 10వ తేదీన రిలజ్ అయింది. ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకోగా, బాక్సాఫీస్ వద్ద డీలా పడింద

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం అజ్ఞాతవాసి. ఈచిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 10వ తేదీన రిలజ్ అయింది. ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకోగా, బాక్సాఫీస్ వద్ద డీలా పడింది. వాస్తవానికి ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయం అనుకున్నారు. కానీ, ఆశించిన స్థాయిలో సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకోలేదు. ఫలితంగా వసూళ్ల పరంగా చూస్తే పవన్ మార్క్ కూడా ఏమాత్రం కనిపించలేదు. దీంతో పవన్ తాను తీసుకున్న రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. 
 
ఈ చిత్రానికి వచ్చిన నెగెటివ్ టాక్ కారణంగా డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారనే టాక్ వినిపిస్తోంది. అయితే వాళ్లకు వాటిల్లిన ఈ నష్టాన్ని కొద్దిమేర తగ్గించాలనే దృక్పథంతో పవన్.. తాను తీసుకున్న రెమ్యూనరేషన్ నుండి 15 కోట్ల రూపాయలను తిరిగి ఇవ్వనున్నారట. అయితే సినిమా సంగతి అటుంచితే పవన్ ప్రదర్శిస్తున్న ఈ ఉదార భావానికి సంతోషంలో మునిగితేలుతున్నారు మెగా అభిమానులు.