మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 13 జనవరి 2018 (11:34 IST)

''అజ్ఞాతవాసి'' సినిమాకెళ్లాడు.. ఫినాయిల్‌ను కూల్‌డ్రింక్ అనుకుని తాగేశాడు..

''అజ్ఞాతవాసి'' బాక్సాఫీస్ వద్ద బోల్తాపడినట్లు వార్తలు వస్తున్నా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో అజ్ఞాతవాసి సినిమా చూసేందుకు వ‌చ్చిన ఓ అభిమాని మృతి చెందాడ‌ు. వివరాల్లోకి వెళితే.. బ‌ళ్లారిలో

''అజ్ఞాతవాసి'' బాక్సాఫీస్ వద్ద బోల్తాపడినట్లు వార్తలు వస్తున్నా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో అజ్ఞాతవాసి సినిమా చూసేందుకు వ‌చ్చిన ఓ అభిమాని మృతి చెందాడ‌ు. వివరాల్లోకి వెళితే.. బ‌ళ్లారిలోని శాస‌వాస‌పురంలో ఉండే రాముకు ప‌వ‌న్ అంటే ఎన‌లేని అభిమానం.

అయితే అజ్ఞాతవాసి సినిమా విడుద‌ల నేప‌థ్యంలో త‌న స్నేహితుల‌కు పార్టీ ఇచ్చి ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు. ఆ త‌రువాత‌ బుధవారం రాత్రి బళ్లారిలో గంగా అనే థియేట‌ర్లో అజ్ఞాతవాసి సినిమాకు వెళ్లాడు. సినిమాకి వెళ్లిన త‌రువాత కొద్దిసేప‌టికి బాత్రూంకి వెళ్లాడు. 
 
అక్క‌డ ఒక ఫినాయిల్ క‌న‌ప‌డ‌గా అది కూల్ డ్రింక్ అనుకొని తాగేశాడు. అనంత‌రం బాత్రూంలోనే విగ‌త జీవిగా కుప్ప‌కూలిపోయాడు. అంత‌లోనే బాత్రూంకి వ‌చ్చిన ప్రేక్ష‌కులు విగ‌త‌జీవిగా ప‌డిఉన్న రామును థియేటర్ యాజమాన్యం హుటాహుటీన వీఐఎంఎస్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 
 
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాము ప్రాణాలు కోల్పోయాడు. కూల్‌డ్రింక్ అనుకొని ఫినాయిల్ తాగడం ఏమిటని.. పవన్ ఫ్యాన్ మృతా లేకుంటే ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అజ్ఞాతవాసి సినిమా నచ్చకపోవడం వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే కోణంలోనూ విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు.