శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 11 మే 2018 (20:24 IST)

తొక్కే కదా అని పడవేస్తాం... కానీ మనం ఎంత కోల్పోతున్నామో తెలుసా?

మనం ప్రతిరోజు రకరకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తింటూ ఉంటాం. వీటిలో ఉండే విటమిన్లు, పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కూరగాయలు, పళ్లు తరిగేటప్పుడు వాటిలోని విటమిన్లు, పోషకాలు పోకుండా తరగాలి. తొక్కులు, గింజలు, కాండము, వేళ్లు, ఆకులు అన్నీ శరీ

మనం ప్రతిరోజు రకరకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తింటూ ఉంటాం. వీటిలో ఉండే విటమిన్లు, పోషకాలు  మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కూరగాయలు, పళ్లు తరిగేటప్పుడు వాటిలోని విటమిన్లు, పోషకాలు పోకుండా తరగాలి. తొక్కులు, గింజలు, కాండము, వేళ్లు, ఆకులు అన్నీ శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. అందుకే కూరగాయలలోని ఏ భాగాన్ని వృధా చేయకూడదు.


కూరగాయలు, పళ్లు తరగడం కూడా ఒక కళే.. ఎందుకంటే చాలామంది కూరగాయలు తరిగేటప్పుడు వాటికున్న పొట్టు లేదా గింజల్ని, ఆకుల్ని తీసి చెత్తబుట్టలో పారేస్తుంటారు. అంతేకాదు తొక్కను తీసేటప్పుడు కూరగాయల కండ బాగా పోయేలా తరుగుతుంటారు. ఇలా చేయడం వల్ల వెజిటబుల్స్ వృధా కావడమే కాదు వాటిల్లోని పోషకాలు సైతం నష్టపోతుంటాము. కూరగాయలను పద్ధతి ప్రకారం తరగకపోవడం వల్ల వాటిలోని పోషకాలు పనికిరాకుండా పోతాయి. 
 
పూర్వం మన బామ్మలు, అమ్మమ్మలు తొక్కుపచ్చడి, జారుపచ్చళ్లు ఎంతో రుచిగా చేసేవాళ్లు. ఉదాహరణకు సొరకాయ తొక్కలో మెులకలు వేసి వండిన కూర ఎంతో అధ్బుతంగా ఉండేది. సొరకాయ, బీరకాయ తొక్కలతో చేసిన పచ్చడిలో శరీరానికి కావల్సిన ఎన్నో పోషక విలువలు ఉండేవి. అంతేకాకుండా ఆంధ్రా స్పెషల్‌గా చెప్పే దోసావకాయను తొక్కతోనే చేస్తుంటారు. పుచ్చకాయపై ఉండే తొక్కతో కూడా పచ్చడి చేసుకోవచ్చు. కూరగాయలలోని ఏ భాగాన్ని వృధా చేయకూడదన్న భావన మన పెద్దవాళ్లలో ఎక్కువుగా ఉండేది. దీనికి కారణం తొక్క దగ్గరి నుంచి వేరు దాకా ప్రతీదానికి ఏదోరకమైన ప్రయోజనం ఉంటుంది. 
 
కూరగాయల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం వల్ల ఆహారం వృధా కాకపోవడమే కాదు మనం తీసుకునే డైట్‌లో కూరగాయలలోని మాక్రో, మైక్రో స్థాయి న్యూట్రియంట్లు అన్నీ శరీరానికి అందుతాయి. బంగాళదుంప తొక్కలో విటమిన్ -సి, బి6, పొటాషియం, మాంగనీస్, కాపర్‌లు అధికంగా ఉంటాయి. ముల్లంగిని కూడా తొక్కతో వండితే మంచిది.

ఎందుకంటే దీని తొక్కలో యాంటాక్సిడెంట్లలో ఉండే ఇసొధియోసియనేట్స్ పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఊపిరితిత్తులు బాగా పనిచేయడంలో యాపిల్ తొక్క కీలక పాత్ర వహిస్తుంది. దీనిలో క్వెర్ సెటిన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఏ కూరను చేసుకునేటప్పుడు అయినా దానికున్న బహుళ ప్రయోజనాలను మనసులో పెట్టుకొని వండుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు, విటమిన్లు అందడంతో పాటు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.