గురువారం, 2 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By kowsalya
Last Updated : శనివారం, 5 మే 2018 (11:43 IST)

మధుమేహాన్ని, కొలెస్ట్రాల్‌ను తగ్గించే రాగుల ఇడ్లీలు ఎలా చేయాలి?

రాగులు మధుమేహ వ్యాధికి ఎంతో మేలు చేస్తాయి. రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయాలు మధుమేహాన్ని నియంత్రించేందుకు ఉపయోగపడతాయి. రాగుల్లోని విటమిన్‌ బీ3 శరీరంలోని కొలెస్ట్ర

రాగులు మధుమేహ వ్యాధికి ఎంతో మేలు చేస్తాయి. రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయాలు మధుమేహాన్ని నియంత్రించేందుకు ఉపయోగపడతాయి. రాగుల్లోని విటమిన్‌ బీ3 శరీరంలోని కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తుంది. వీటిల్లో అధిక మోతాదులో లభించే యాంటీ ఆక్సిడెంట్లూ, క్యాన్సర్‌ కారకాలైన ఫ్రీరాడికల్స్‌ను శరీరం నుంచి తొలగిస్తాయి.


రాగులను వారానికి రెండుసార్లు లేదా మూడు సార్లు తీసుకోవడం ద్వారా జుట్టు వత్తుగా పెరుగుతుంది. ఇంకా హెయిర్ ఫాల్ సమస్య తొలగిపోతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న రాగులతో సులభంగా ఇడ్లీలు ఎలా తయారు చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు: 
ఇడ్లీ పిండి - రెండు కప్పులు
రాగి పిండి - అర కప్పు
వేడి నీళ్లు - పావు కప్పు
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా
 
తయారీ విధానం: 
ముందుగా నీళ్లు వేడి చేసి రాగి పిండి వేసి చిక్కటి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ పేస్టును ఇండ్లీ పిండిలో కలుపుకుని.. 15 నుంచి 20 నిమిషాలు పక్కనుంచితే పిండి నీళ్లను పీల్చుకుంటుంది. తర్వాత ఇడ్లీ ప్లేట్లలో ఈ పిండితో నింపుకుని ఇడ్లీ కుక్కర్‌లో నీళ్లు పోసి మరిగించాలి. కుక్కర్లో నీళ్లు బాగా మరిగాక కుక్కర్‌లో ఇడ్లీ ప్లేట్లను ఉంచి, ఆవిరి మీద 15 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే రాగులతో వేడి వేడి ఇడ్లీలు రెడీ అయినట్లే. ఈ రాగుల ఇడ్లీలను సాంబారు లేదా కొబ్బరి చట్నీతో వేడిగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.