ఆదివారం, 3 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : శుక్రవారం, 23 నవంబరు 2018 (15:58 IST)

ఈవీఎం ధర ఎంతో తెలుసా?

ప్రస్తుతం శాసనసభ, లోక్‌సభ ఎన్నికల కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) ఉపయోగిస్తున్నారు. ఒక్కో ఈవీఎం ధర సుమారుగా 17 వేల రూపాయలు. ఈవీఎంల కొనుగోలుకు ముందుగా భారీగా వెచ్చించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ ఖర్చును భారీగా తగ్గించవచ్చు. కోట్ల కొద్దీ బ్యాలెట్ పత్రాలను ముద్రించాల్సిన అవసరం లేదు. 
 
ఇలా ముద్రించిన బ్యాలెట్ పత్రాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు భారీ ఖర్చు చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. పైగా, ఈవీఎంల వాడకంతో చాలా తక్కువ ఖర్చు, సిబ్బందితో ఎన్నికల పోలింగ్ నిర్వహించవచ్చు. గత 2000 ఎన్నికల నుంచి ఈ ఈవీఎంల వాడకం అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా టన్నుల కొద్దీ కాగితం అవసరం తగ్గిపోయింది.