సంబంధిత వార్తలు
- శారిడాన్‌కు సలాం.. మార్కెట్టో శారిడాన్ టాబ్లెట్ మాయం
- బీజేపీ మినీ కాంగ్రెస్.. ముస్లింలకు మోడీ వకాల్తాదారు : తొగాడియా నిప్పులు
- 'లంచం' రూపంలో 'మంచం' కోరినా నేరమే...
- రెండోసారి ప్రధానిగా మోడీ వద్దంటున్నారు : కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశ్వాహా
- ముందుగానే చనిపోయిన వాజ్‌పేయి.. మోడీ ప్రసంగానికి అడ్డొస్తుందనీ... ?!
మోడీని రాందేవ్ బాబా వార్నింగ్.. మూల్యం చెల్లించక తప్పదంటూ...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి యోగా గురువు బాబా రాందేవ్ గట్టివార్నింగ్ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి యోగా గురువు బాబా రాందేవ్ గట్టివార్నింగ్ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరించారు.
ఇదే అంశంపై ఆయన ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ, దేశంలో రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించక తప్పదన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో తాను ప్రభుత్వంలో ఉన్నట్టయితే పెట్రోలు, డీజిల్‌ను 35-40 రూపాయలకే ఇచ్చేవాడినన్నారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీలో చేర్చాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
చాలా మంది ప్రజలు మోడీని విమర్శిస్తున్నారని, కానీ స్వచ్ఛ భారత్ వంటి మంచి కార్యక్రమాలను కూడా మోడీ ప్రారంభించారని చెప్పారు. అయితే వాక్‌స్వాతంత్ర్యం ప్రజల ప్రాథమిక హక్కని ఆయన గుర్తు చేశారు.
తర్వాతి కథనం
