1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Saridon Tablet will vanish due to Union Govt decision

శారిడాన్‌కు సలాం.. మార్కెట్టో శారిడాన్ టాబ్లెట్ మాయం

తలనొప్పి అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు శారిడాన్... ఒకే ఒక సారిడన్.. తలనొప్పులన్నీ మాయం.. అంటూ వచ్చే ప్రకటన ప్రతి వారికీ గుర్తుంటుంది. తాజాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం శారిడాన్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. దానితో పాటు 328 రకాల మందులపై సర్కార్ ని

Saridon Tablet
తలనొప్పి అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు శారిడాన్... ఒకే ఒక సారిడన్.. తలనొప్పులన్నీ మాయం.. అంటూ వచ్చే ప్రకటన ప్రతి వారికీ గుర్తుంటుంది. తాజాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం శారిడాన్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. దానితో పాటు 328 రకాల మందులపై సర్కార్ నిషేధం విధించింది. ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, ఎఫ్‌డీసీల తయారీని, విక్రయాలను, పంపిణీని నిరోధించడం అవసరం అని డ్రగ్స్ సాంకేతిక బోర్డు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. 
 
మార్కెట్లో విరివిగా దొరుకుతున్న పెయిన్ కిల్లర్స్ మీద కూడా ఉక్కుపాదం మోపింది కేంద్ర సర్కార్. కేవలం తాత్కాలిక ఉపశమనం పేరుతో ఆరోగ్యానికి తీవ్ర హాని చేస్తాయని పేర్కొది. పలు రకాల కంపెనీలు దాదాపు 6000 బ్రాండ్లతో ఈ ఔషధాలను మార్కెట్లో అమ్ముతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ బ్రాండ్ల అమ్మకాలన్నీ ఆగిపోనున్నాయి. వీటిలో పెయిన్ కిల్లర్స్‌తో పాటు ప్యాండిమ్ స్కిన్ క్రీమ్, గ్లుకోనామ్ పీజీ యాంటి డయాబెటిక్‌లపై కూడా నిషేదం విధించింది. సో... శారిడాన్‌కు ఇక బై బై చెప్పాల్సిందే.
About Writer
srinivas
తర్వాతి కథనం
శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు