మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (14:50 IST)

సెంచరీకి చేరువలో పెట్రోల్ ధర.. మోడీ హయాంలో సరికొత్త రికార్డు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో శుక్రవారం ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాయి. ఫలితంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రికార్డు స్థా

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో శుక్రవారం ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాయి. ఫలితంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రికార్డు స్థాయిలో లీటర్ పెట్రోల్ రూ.87.39కి చేరింది. రూ.90 దాటడానికి మరెన్నో రోజులు పట్టదంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
అలాగే, ఇతర రాష్ట్రాల్లో కూడా పెట్రోల్ ధరలు రూ.80లను దాటేసింది. మధ్యప్రదేశ్‌లో మునుపెన్నడూ లేని విధంగా లీటర్ పెట్రోల్ రూ.85.80కి చేరింది. ఢిల్లీలో రూ.79.99కి పెట్రోల్ ధరలు చేరుకోగా, డీజిల్ 72.07 అయింది. ఇదే తరహాలో డీజిల్ ధరలు సైతం చుక్కలనంటుతున్నాయి. 
 
ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.72.07కు చేరింది. గురువారం ఈ ధర రూ.71.55గా ఉంది. ముంబైలోనూ డీజిల్ ధర గణనీయంగా పెరిగిపోయింది. మిగతా రాష్ట్రాల్లోనూ డీజిల్ ధర రూ.75-77 మధ్య ఊగిసలాడుతోంది. చెన్నైలో కూడా లీటరు పెట్రోల్ ధర రూ.82గా ఉంది.